Jump to content

Nara Bhuvaneswari: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందించిన నారా భువనేశ్వరి


psycopk

Recommended Posts

Nara Bhuvaneswari: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందించిన నారా భువనేశ్వరి 

26-10-2023 Thu 15:17 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటన
 
Nara Bhuvaneswari Nijam Gelavali tour continues on day two

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' పరామర్శ యాత్ర నేడు రెండో రోజు కొనసాగుతోంది. నారా భువనేశ్వరి ఇవాళ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్త పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ నివాసానికి వెళ్లారు. 

అక్కడ వెంకటసుబ్బయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వెంకటసుబ్బయ్య కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందజేశారు. 

టీడీపీ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వెంకటసుబ్బయ్య వంటి కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు అని నారా భువనేశ్వరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటికి వస్తారని,  టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె సూచించారు.
20231026fr653a3582e116e.jpg20231026fr653a358f0d545.jpg20231026fr653a35a401c42.jpg20231026fr653a35afa4d86.jpg20231026fr653a35998440a.jpg

  • Haha 1
Link to comment
Share on other sites

Ambati Rambabu: మీరెంత ఉద్యమం చేస్తే చంద్రబాబు అంత ఇరుక్కుపోతారు: నారా భువనేశ్వరి యాత్రపై అంబటి వ్యాఖ్యలు 

26-10-2023 Thu 18:11 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • పలువురు టీడీపీ కార్యకర్తల మరణం
  • నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
  • అవినీతి గెలవాలి అని యాత్ర చేపడితే బాగుంటుందని అంబటి ఎద్దేవా
 
Ambati Rambabu satires on Nara Bhuvaneswari Nijam Gelavali bus tour

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిజం గెలవాలి పేరిట ఆమె నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

నిజం గెలవాలని నారా భువనేశ్వరి ఎంతగా ఉద్యమం చేస్తే చంద్రబాబుకు అంత నష్టం అని అన్నారు. చంద్రబాబు కోసం పోరాడే కొద్దీ, ఆయన మరింతగా ఇరుక్కుపోతారని వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేసే బదులు... అన్యాయం గెలవాలి, అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి అని యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, అలాంటప్పుడు అరెస్ట్ చేయడంలో ఆశ్చర్యమేముందని అన్నారు. 

చంద్రబాబు అరెస్టయితే కొందరు ప్రాణాలు వదిలారట... ఇప్పుడు వాళ్లను పరామర్శిస్తున్నారట అంటూ నారా భువనేశ్వరి బస్సు యాత్రపై అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన నారా భువనేశ్వరి 

26-10-2023 Thu 18:56 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మృతి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు
  • నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
  • తిరుపతిలో మహిళలతో ముఖాముఖి 
 
Nara Bhuvaneswari satires on AP Govt

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్రలో భాగంగా తిరుపతి విచ్చేశారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరెస్టులు, కేసులతో వేధించడమే ఏపీ ప్రభుత్వ గొప్పదనం అని అన్నారు. ఏపీ నెంబర్ వన్ గా ఉంది ఇందులోనే అని ఎద్దేవా చేశారు. నాడు మహాత్మాగాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే, నేడు వైసీపీ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సి వస్తోందని తెలిపారు. 

ఆఖరికి చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాస్తే, పనీపాటా లేనట్టు ఆ లేఖపైనా విచారణ జరుపుతున్నారని భువనేశ్వరి విమర్శించారు. లేఖపై విచారణ కోసం వినియోగించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుందని హితవు పలికారు. 

టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి భయపడకుండా ఐక్యంగా పోరాడుదాం అని పార్టీ శ్రేణులుకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. మనం ఇప్పుడు చేసే పోరాటం భవిష్యత్తు కోసమేనని ఉద్ఘాటించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

9 minutes ago, Vaaaampire said:

Ravalamma ravali. Okkapudu yesu reddy chanipothey fans chanipoyaru ani jaffa yatra ni comedy chesina members ravali. More comedy now

Jagga created a template on how to create sad events and gain sympathy.. tdp is trying to use that template.. success avtaro ledo chuddam… 

many ppl are suckers for sentiments.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, Thokkalee said:

Jagga created a template on how to create sad events and gain sympathy.. tdp is trying to use that template.. success avtaro ledo chuddam… 

many ppl are suckers for sentiments.. 

anna u conveniently missed alapiri incident.

2004 elections time lo sagam rtc buses meedha injured cbn photo ney. Mruthyunjayudu mana chandrababu naidu ani caption

Link to comment
Share on other sites

28 minutes ago, Thokkalee said:

Jagga created a template on how to create sad events and gain sympathy.. tdp is trying to use that template.. success avtaro ledo chuddam… 

many ppl are suckers for sentiments.. 

Jagga gadu created arrest template as well. Next vaadini kuda yedho chinna comedy case vesi jail lo vestharu. Already CM expecting candidate OK garu chepparu English medium case Ani. If I am not wrong case papers draft ready chese vuntaru Pulkas lawyers. 

But I think this tour for lady sentiment lu. Pasupu kumkuma theeskoni kantlo kaaram kottaru last time so strategical ga eeme ni enter chesaru ladies sympathy kosam. Still wondering CBN anticipatory bail nduku apply cheyyaledhu arrest chestharu in info vundi kuda? Looks like andaru in his trap ? Or BJP game ? 

Link to comment
Share on other sites

Nara Bhuvaneswari: పవన్ కల్యాణ్ "బాగున్నారా అమ్మా" అని ఆప్యాయంగా అడిగారు: నారా భువనేశ్వరి 

26-10-2023 Thu 20:05 | Andhra
  • 'నిజం గెలవాలి' యాత్రకు నేడు రెండో రోజు
  • తిరుపతి 'అంకుర' ఆసుపత్రి పక్కన నారా భువనేశ్వరి సభ
  • మహిళలతో ముఖాముఖి
  • మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన చంద్రబాబు అర్ధాంగి 
 
Nara Bhuvaneswari recalls Pawan Kalyan affectionate words

‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని 'అంకుర' ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి ప్రసంగించారు. 

"మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని... కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం (భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్) నాలుగు దిక్కులయ్యాం. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయింది" అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కాగా, ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

వంగలపూడి అనిత:  చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు?

 
భువనేశ్వరి: తప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు. అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికి రారు... పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసుకోండి... ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు. పార్టీ సభ్యత్వానికి కార్యకర్తలు రూ.100 ఇస్తే దానిపైనా విచారణ చేస్తామంటున్నారు. ప్రజల సొమ్ముకు చంద్రబాబు ఎప్పుడూ ఆశపడరు. 

రాజేశ్వరి, గూడూరు: చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో ప్రజలకు కనబడకుండా ఏ ఒక్క రోజు కూడా లేదు. కానీ ఇప్పుడు చూడక 45 రోజులైంది... చంద్రబాబు ఎలా ఉన్నారు... మాకు ఏమి చెప్పమన్నారు?
 
భువనేశ్వరి: చంద్రబాబు ప్రజల మనిషి. నాకంటే మీకే ఎక్కువ ఆయన గురించి తెలుసు. మాకు ములాఖత్ కు 30 నిమిషాలు సమయం ఇస్తున్నారు. 25 నిమిషాలు పార్టీ, ప్రజల గురించే అడుగుతారు. 5 నిమిషాలే మా గురించి మాట్లాడతారు. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్. ఎవరు ఏమి చేసినా ఆయన బెదరడు. 

గిరిజ, తిరుపతి: ఎన్నికల ముందు  చంద్రబాబును అరెస్టు చేసి ఎన్నికలకు ఎళ్లాలని చూస్తున్నారు... దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? 

భువనేశ్వరి: మీరు కరెక్టుగా చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును బయట లేకుండా చేయాలని చూస్తున్నారు. భవిష్యత్ గ్యారంటీ, యువగళం పాదయాత్ర సక్సెస్ అయ్యాయి. దీంతో భయపడి చంద్రబాబును లోపల వేశారు. లోకేశ్ మళ్లీ పాదయాత్ర చేస్తారు. ఎన్నికలొస్తున్నాయి. ఓటు చాలా విలువైంది. మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించి ఓటేయాలి. 

సుధ: మీ తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు సీఎంగా, మీ కుమారుడు లోకేశ్ మంత్రిగా చేశారు. ఇంత గొప్పస్థాయిని చూసిన మీరు ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు? 

భువనేశ్వరి: మా తండ్రి పౌరుషం నాలో ఉంది. చంద్రబాబుతో పెళ్లయ్యాక క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నా. ఇవే నన్ను ముందుకు తీసుకెళతాయి. 

ప్రవీణ, తిరుపతి: జగన్ అరెస్టు అయినప్పుడు ఇంట్లో నలుగురు తప్ప ఎవరూ న్యాయం అడగలేదు. కానీ చంద్రబాబు అరెస్టు అయ్యాక, తెలుగు ప్రజలు, ఉద్యోగులు న్యాయం కావాలిని అడుగుతున్నారు. దీనిపై మీరేమంటారు.?
 
భువనేశ్వరి: చంద్రబాబు కష్టం వారు మర్చిపోలేదు. చంద్రబాబు వారి ఇంట్లో వెలుగులు నింపారు. అలాంటి మనిషిని ఎవరూ మర్చిపోలేదు... ఇప్పుడూ ఆయనను నమ్ముతున్నారు. అందుకే మహిళలు న్యాయం కోసం ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఏనాడూ రాని మహిళలు బయటకు వచ్చి పోరాడుతుంటే పోలీసులు ఇబ్బందులు పెడతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే నీరు ఎలా ఇవ్వాలో ఆలోచించకుండా, చంద్రబాబు లేఖపై విచారణ అంటూ పనిలేని ఆలోచనలు చేస్తున్నారు. 

సులోచన, తిరుపతి: మీరు ఈ జిల్లాకు కోడలు అయ్యి 40 ఏళ్లు అయింది. మిమ్మల్ని మేము ఎప్పుడూ ఒంటరిగా చూళ్లేదు. తిరుపతి, నారావారిపల్లెకు ఒంటరిగా వెళ్లారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? 
 
భువనేశ్వరి: జీవితంలో ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది. ఈ ధైర్యంతో అంతా కలిసి ఉన్నాం. 

భువన, లా స్టూడెంట్: ఎంపీ హత్య చేస్తే ఆధారాలున్నా అరెస్టు చేయలేదు. కానీ చంద్రబాబుపై ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు? 
 
భువనేశ్వరి: ఆలస్యం అయినా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు. 

హరిప్రసాద్, జనసేన: ధర్మాన్ని కటకటాల వెనక్కు నెట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక లక్ష్మణుడిలా కదిలి వచ్చారు. పవన్ మిమ్మల్ని కలవడం మీకు ఎలా అనిపించింది?
 
భువనేశ్వరి: నన్ను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు "బాగున్నారా అమ్మా" అని ఆప్యాయంగా అడిగారు. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి చెప్పి బాధపడ్డారు. మాలాగే రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. మన రెండు పార్టీలు కలసి ముందుకు వెళతాయని ఆశిస్తున్నా.
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

Nara Bhuvaneswari: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందించిన నారా భువనేశ్వరి 

26-10-2023 Thu 15:17 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటన
 
Nara Bhuvaneswari Nijam Gelavali tour continues on day two

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' పరామర్శ యాత్ర నేడు రెండో రోజు కొనసాగుతోంది. నారా భువనేశ్వరి ఇవాళ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్త పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ నివాసానికి వెళ్లారు. 

అక్కడ వెంకటసుబ్బయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వెంకటసుబ్బయ్య కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందజేశారు. 

టీడీపీ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వెంకటసుబ్బయ్య వంటి కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు అని నారా భువనేశ్వరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటికి వస్తారని,  టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె సూచించారు.
20231026fr653a3582e116e.jpg20231026fr653a358f0d545.jpg20231026fr653a35a401c42.jpg20231026fr653a35afa4d86.jpg20231026fr653a35998440a.jpg

This woman's face cut, aa family member laaga undi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...