Jump to content

CBN remanded from 50days with out proof


psycopk

Recommended Posts

TDP: నిజంగానే ఆధారాలు ఉంటే 50 రోజులుగా ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్ 

28-10-2023 Sat 13:44 | Andhra
  • చంద్రబాబుపై కేసులకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్
  • ఇదే శ్రద్దను రైతుల సమస్యలు తీర్చడంలో చూపించాలని ప్రభుత్వానికి హితవు
  • చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారని విమర్శ
 
Nara Lokesh Speech Live

చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని, అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ, తమ పార్టీ నేతలకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేశ్ విమర్శించారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు. సౌత్ ఇండియాలోనే ఎన్ ఎస్ జీ ప్రొటెక్షన్ కలిగిన ఒకేఒక నేత చంద్రబాబు అని, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్రం ఈ రక్షణ కల్పించిందని చెప్పారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టి, సరైన రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందన్నారు. తమ అధినేతను జైలులోనే అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి, లోకేశ్‌, కాసాని 

28-10-2023 Sat 11:34 | Both States
  • స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో చంద్రబాబు
  • ములాఖత్ లో చంద్రబాబును కలిసిన భార్య, కుమారుడు
  • ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
 
Nara Bhuvaneswari Nara Lokesh Kasani Ganeswar meets Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చర్చించారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Telugudesam: కావ‌లిలో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌ బీఆర్ సింగ్‌పై దాడిని ఖండించిన నారా లోకేశ్ 

28-10-2023 Sat 13:05 | Andhra
  • కావలిలో బస్సు డ్రైవర్‌పై దాడిని ఖండించిన యువనేత
  • హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపణ
  • ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
 
Andhra Pradesh has turned into Psycho Jagan Faction Pradesh says Nara Lokesh

అవినీతి దందాలకు అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కావ‌లిలో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ బీఆర్ సింగ్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ ప్ర‌దేశ్‌గా మారిపోయిందని మండిపడ్డారు. సైకో జ‌గ‌న్ పోతేనే ఇలాంటి పిల్ల సైకో గ్యాంగుల‌న్నీ పోతాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప‌ట్టిన పీడ విర‌గ‌డ‌వుతుందని లోకేశ్ మండిపడ్డారు.

వైసీపీ అధినేత త‌న అవినీతి దందాల‌కు అడ్డొస్తున్నార‌ని సొంత బాబాయ్‌ని వేసేస్తే.. ఆయ‌న సైకో ఫ్యాన్స్ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని వ్యాఖ్యానించారు. కావ‌లిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాల‌ని ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్ట‌డ‌మే నేర‌మైందని పేర్కొన్నారు. న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. కొందరు వ్యక్తులు బస్సు డ్రైవర్‌పై దాడి చేస్తుండడం ఈ వీడియోలో కనిపించింది.

Link to comment
Share on other sites

1 minute ago, heypilla said:

he should come back and take rest.. should not start caste and chillar politics.

 

He never does anna , itani venaka pacha batch  karudu kattina yellow nri batch untaru vala valayam lo irikipoyadu 

  • Haha 2
Link to comment
Share on other sites

6 minutes ago, csrcsr said:

Sincerely from deep of my heart praying he should come out may God bless him with health and happiness 

He can be punished if proven guilty but inni rojulu just doing time pass  peddayana ni bayataki ravali 

Kontha mandhi antis are praying for more jail , konthamandhi yellow batch is trying for more sympathy for his jail , please pray for his health 🙏 peddayana health is beyond politics , bayatakai vachaka mee istam support istaro ledo mee istam, sidantham veru personal life veru

miku nachaka poyina he was our  cm for 14 years in our lives.

 

What antis? His own son wants him dead so that pappu can become CM by sympathy 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, csrcsr said:

He never does anna , itani venaka pacha batch  karudu kattina yellow nri batch untaru vala valayam lo irikipoyadu 

aa NRI's e poti cheyochu kada CBN di nakakunda.. they can join TDP and contest elections.. why are they still followers and not the leaders?

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...