Jump to content

Nara Lokesh: రైతులు అల్లాడుతున్నారు... ఆదుకోండి: ఏపీ సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ


psycopk

Recommended Posts

Nara Lokesh: రైతులు అల్లాడుతున్నారు... ఆదుకోండి: ఏపీ సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ 

30-10-2023 Mon 16:31 | Andhra
  • రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న లోకేశ్
  • ఎండిన పంటలు చూస్తే గుండె బరువెక్కుతోందని వ్యాఖ్య 
  • రైతులు పంటల్ని తగలబెడుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వ్యాఖ్యలు
 
Nara Lokesh open letter to CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో అల్లాడుతోన్న రైతాంగాన్ని త‌క్షణ‌మే ఆదుకోవాలని స్పష్టం చేశారు. నీరు లేక ఎండిన పంట‌లు చూస్తే గుండె త‌రుక్కుపోతోందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మరో మార్గం లేక పంట‌ల్ని రైతులు త‌గ‌ల‌బెడుతుంటే క‌ళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వెల్లడించారు. వ‌రి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృద‌యం ద్రవించిపోతోందని పేర్కొన్నారు. 

"నీరు వ‌దిలి పంట‌ల్ని కాపాడాలంటూ అధికారుల కాళ్లపై ప‌డి ప్రాధేయప‌డుతున్న అన్నదాత‌లు, సాగు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా క‌నిపిస్తున్నారు.  ప్రభుత్వం త‌క్షణ‌మే స్పందించ‌క‌పోతే ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి వుంది. 

రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవు. తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలో నమోదైంది. రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో  మీ ప్రభుత్వం విఫలమైంది. 

ఖరీఫ్ పంటలే నీటికి కటకటలాడుతుంటే, రబీ సాగు ప్రశ్నార్థకమే. కొన్ని ప్రాజెక్టులలో నీటి నిల్వ లేదు, మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరున్నా... పంటలు ఎండిపోతున్నా వ‌ద‌ల‌రు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్ని ప్రజలకి వివరించేందుకు వ‌చ్చిన చంద్రబాబు గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలులో బంధించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయ‌న‌ని జైలులో నిర్బంధించే కుట్రల‌పై స‌మీక్షించే స‌మ‌యం ఉంది కానీ, క‌రవుపై సమీక్షించే తీరిక లేని సీఎం ఉండడం ప్రజల దురదృష్టం. 

పెన్నా, తుంగభద్ర కాలువల కింద, కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, బావుల నుంచి నీరందించి పంటలు కాపాడుకుందామంటే కరెంటు కోతలతో సాధ్యం కావడంలేదు. 

రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. యుద్ధప్రాతిప‌దిక‌న‌ కరవు మండలాలని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలి. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలి. పంట‌ నష్టం అంచనా వేసి రైతుల‌కు నష్ట పరిహారం తక్షణమే అందించాలి" అని డిమాండ్ చేశారు.
20231030fr653f8d028a762.jpg

  • Haha 1
Link to comment
Share on other sites

Telugudesam: పొన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కిలారు ఏటీఎంగా మార్చుకున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర 

30-10-2023 Mon 22:13 | Andhra
  • పంటలు ఎండిపోతున్నా రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపణ
  • పదవిని, నియోజకవర్గాన్ని పాడి గేదెలా మార్చుకున్నారని ఎమ్మెల్యేపై మండిపాటు
  • టీడీపీ హయాంలో రూ.53 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని ప్రస్తావన
 
Ponnur constituency has become an ATM for MLA Kilaru says Dhulipalla Narendra

పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా (ఎనీ టైమ్ మనీ) మార్చుకున్నారని మండిపడ్డారు. కౌలుకు తీసుకొని, ఎకరాకి రూ.30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతుల కోసం ఏమీ చేయడంలేదంటూ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమీ చేయలేరని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.

కిలారు వెంకట్రావు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏటీఎం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని, నియోజకవర్గాన్ని ఆయన ఎనీటైమ్ మనీగా మార్చుకున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని పాడి గేదె లాగా మార్చారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. డబ్బులు దండుకోవడం తప్పితే ప్రజల బాధలు ఆయనకు పట్టవని వ్యాఖ్యానించారు.

ప్రజల బాధలు కలెక్టర్‌కు పట్టవని, ముఖ్యమంత్రి కూడా పట్టవని ఆరోపించారు. టీడీపీ హయంలో ఈ ప్రాంతంలో పంటలను కాపాడడానికి రూ.53 కోట్లతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. కానీ నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రైతు సమస్యలు పరిష్కారం చేయకపోగా, వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...