Jump to content

Visionary kosam roads medane sleeping


ARYA

Recommended Posts

Telugudesam: సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు 

01-11-2023 Wed 07:02 | Andhra
  • 14.30 గంటల సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఉండవల్లి నివాసానికి
  • ఉదయం 4.45 గంటలకు ఇంటికి చేరుకున్న చంద్రబాబు
  • రోడ్డు పొడవునా టీడీపీ శ్రేణుల ఘనస్వాగతాలు
 
Chandrababu reached home after a long journey

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై మంగళవారం సాయంత్రం విడుదలైన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 14.30 గంటల నిర్వీరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఇంటికి వెళ్లారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా చంద్రబాబు అలసిపోయారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. ‘జై చంద్రబాబునాయుడు’, ‘లాంగ్ లివ్ చంద్రన్న’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


చంద్రబాబు నివాసానికి అమరావతి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతి టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.  

 

Link to comment
Share on other sites

4 minutes ago, ntr2ntr said:

180 kms ni reach avvadaaniki 14 hours pattindi. Lakhs of crowd wait chesaru night antha CBN ni choodadaniki. Never happened for any politician. Thanks ra tuqlaq nee valla CBN range ento malli andariki telisindi. Night antha nidra kooda poyi vundavu nuvvu and nee paytm batch @3$%

Adi kuda elections ki mundu desperate ga 5 cases to keep him in to counter the huge anti incumbency

Link to comment
Share on other sites

Telugudesam: చంద్రబాబు రాకతో దద్దరిల్లిన బెజవాడ.. బెంజిసర్కిల్‌లో అపూర్వస్వాగతం 

01-11-2023 Wed 07:22 | Andhra
  • అడుగడుగునా నీరాజనాలు.. హారతుల స్వాగతాలు
  • ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలు
  • రాత్రి, తెల్లవారుజాము సమయంలో కూడా పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ శ్రేణులు
 
Unprecedented welcome for chandrababu in vijayawada and inBenz in Circle

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వస్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయన ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’  అంటూ నినాదాలతో  మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. 
కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు.

బెంజిసర్కిల్ వద్ద అపూర్వస్వాగతం

తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దే అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. 

మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు. పోలీసుల తీరుతో మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, usetime63 said:

Half baked happiness, extension approve avadhu and other cases ready for him to go inside, once he's gone this time then it's a long term. 

Do you know who has to declare his condition is fine at the time of return? His own self appointed doctor. Babai murder case lo alane kada YS Avinash valla nanna ochadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...