Jump to content

CBN got his eye operation done


psycopk

Recommended Posts

Chandrababu: కంటి ఆపరేషన్ పూర్తయ్యాక చిరునవ్వులు చిందిస్తూ చంద్రబాబు... ఫొటో ఇదిగో! 

07-11-2023 Tue 17:20 | Both States
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్
  • హైదరాబాదు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సర్జరీ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటో
 
Chandrababu smiles after eye surgery

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

  • Like 1
  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: పూర్తయిన చంద్రబాబు కంటి ఆపరేషన్.. ఇంటికి బయల్దేరిన టీడీపీ అధినేత 

07-11-2023 Tue 12:56 | Andhra
  • ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్
  • దాదాపు 2 గంటల సేపు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు
  • నివాసంలో విశ్రాంతి తీసుకోనున్న చంద్రబాబు
 
Chandrababu eye operation completed

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట 

07-11-2023 Tue 13:10 | Andhra
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా
  • అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు
 
AP High Court orders CID not to arrest Chandrababu in inner ring road case

రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. 

మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని... ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు... అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణకు విరామం ఇచ్చిన హైకోర్టు 

07-11-2023 Tue 12:27 | Andhra
  • విచారణను వాయిదా వేసిన హైకోర్టు
  • ఈరోజు వరకు బాబును అరెస్ట్ చేయకూడదని గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు
  • పీటీ వారెంట్ పై కూడా స్టే విధించిన హైకోర్టు
 
High Court adjourns Chandrababu bail petition hearing in inner ring road case

ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను ఈరోజు హైకోర్టు చేపట్టింది. ఈ విచారణకు హైకోర్టు కాస్త విరామం ప్రకటించింది. గత విచారణ సందర్భంగా ఈరోజు (7వ తేదీ) వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు చంద్రబాబు అన్ని విధాలా సహకరిస్తారని గత విచారణ సందర్భంగా ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. మరోవైపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ పై కూడా హైకోర్టు ఈ రోజు వరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: ఇసుక కేసు.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు 

07-11-2023 Tue 14:23 | Andhra
  • టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా
  • తవ్వకం, రవాణా ఖర్చులను పెట్టుకున్న ప్రజలు
  • ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందంటూ చంద్రబాబుపై కేసు
 
Chandrababu files anticipatory bail petition in sand case

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం వరుసగా వివిధ కేసులు నమోదు చేస్తోంది. తాజాగా ఆయనపై ఇసుక కేసును కూడా నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుపడుతున్నారని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను మాత్రం ప్రజలు భరించారు. దీంతో, ఒక ట్రక్కు ఇసుక కేవలం రూ. 2 వేలకే ప్రజలకు చేరింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ, ఇసుక పాలసీపై ప్రభుత్వం తాజాగా కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుకను కేబినెట్ సమావేశంలో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Chandrababu: కంటి ఆపరేషన్ పూర్తయ్యాక చిరునవ్వులు చిందిస్తూ చంద్రబాబు... ఫొటో ఇదిగో! 

07-11-2023 Tue 17:20 | Both States
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్
  • హైదరాబాదు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సర్జరీ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటో
 
Chandrababu smiles after eye surgery

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Glad to know it went well. But, the complications would start closer to the 20th of November. As of now, everything will be fine. He should take good care of himself.

Link to comment
Share on other sites

  • psycopk changed the title to CBN got his eye operation done
4 minutes ago, FReddy said:

cataract operation, dental checkups kuda sympathy ki vaadukuntunnara mee mohalu manda

Evarinaina veseyamantava anna ipudu sympathy kosam 

Link to comment
Share on other sites

16 minutes ago, Vaaaampire said:

Cbn finished eye operation. I dint knew cbn was doctor

cbn went to the hospital and did the surgical procedure on himself and by himself.

olden days lo Bhakta Kannappa took out his eye with a blunt knife

cbn ki idi jujubi with all the modern equipment.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, FReddy said:

cataract operation, dental checkups kuda sympathy ki vaadukuntunnara mee mohalu manda

Kadedi pracharaniki anarham. velugu kuda dooraleni kantha loki kuda doori credit/sympathy kotteyadam lo CBN sir ki PHD undi\

aayana visionary kadanna vadi kannuni velito podustadu, Ayana inventor kadanna vadini engine tho thokkistadu, Jagratta bhayyo..

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...