Jump to content

Pushpams trying to create sympathy for kcr


psycopk

Recommended Posts

kaleswaram project: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేసీఆర్ అనుమతి అవసరం లేదు: కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరెక్టర్ 

08-11-2023 Wed 16:45 | Telangana
  • కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుపుతామన్న కిషన్ రెడ్డి
  • కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
  • సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదన్న నాగేశ్వరరావు
 
CBI former director to BJP Kishan Reddy on Kaleswaram project

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపడానికి తెలంగాణ ప్రభుత్వం లేదా కేసీఆర్ అనుమతి అవసరం లేదని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుపుతామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు బుధవారం స్పందించారు. ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపవచ్చునని, సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని స్పష్టం చేశారు.

కేంద్రానికి చెందిన పది ఏజెన్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిలిచ్చాయని గుర్తు చేశారు. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చునన్నారు. అలాగే అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణను కోరవచ్చునని తెలిపారు. ఒకవేళ సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని కిషన్ రెడ్డికి సూచించారు. 

 

Link to comment
Share on other sites

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఐటీ దాడులు వంటి ఇబ్బందులు ఊహించా!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

08-11-2023 Wed 14:29 | Telangana
  • తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ దాడులకు అవకాశముందన్న పొంగులేటి
  • కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం
  • ఎన్నికల వరకు కాంగ్రెస్ నాయకులకు ఈ ఇబ్బందులు తప్పవన్న కాంగ్రెస్ నేత
  • కాళేశ్వరంపై కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చినా ఇంకా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య
 
Ponguleti Srinivas Reddy on it searches

తనపైనా, తన కుటుంబం పైనా ఐటీ దాడులకు అవకాశముందని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై తనపై ఐటీ దాడులకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఈ పార్టీలో చేరితే బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతుందని ఉహించానన్నారు.

కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు లీకులు వెంటాడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాల గురించి కేంద్ర సంస్థలు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Thummala: తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలు.. మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు 

08-11-2023 Wed 12:18 | Telangana
  • ఖమ్మంలోని తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు
  • ప్రచారం కోసం తుమ్మల వెళ్లిన తర్వాత ఇంట్లోకి వచ్చిన పోలీసులు
  • ఆ సమయంలో ఇంట్లో ఉన్న తుమ్మల భార్య
 
Police searches in Thummala Nageswar Rao home

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబడుతున్నాయి. 

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, futureofandhra said:

Mosha batch bjp ki vunna value tisaru

No credible partners

They are making deals on the back

It won't last long 

Chandranna bjp ni vadhilinappudey… bjp credibility debgindhii

Link to comment
Share on other sites

union minister: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత తప్పకుండా జైలుకు వెళ్తారన్న కేంద్రమంత్రి అశ్విని చౌబే 

09-11-2023 Thu 18:47 | Telangana
  • హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి
  • గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఏపీకి రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపణ
  • తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ధీమా
 
MLC Kavitha will go jail says union minister

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రమంత్రి అశ్విని చౌబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం కుంభకోణం కేసులో కవితను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత... ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారన్నారు. ఈ తొమ్మిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. 

 

Link to comment
Share on other sites

Revanth Reddy: తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు... స్పందించిన రేవంత్ రెడ్డి 

09-11-2023 Thu 14:27 | Telangana
  • తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతం? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
  • బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు? అన్న టీపీసీసీ చీఫ్
  • రాష్ట్రంలో కాంగ్రెస్ సునామిని ఆపే కుతంత్రమేనని విమర్శలు
 
Revanth Reddy responds on it searches in congress leaders houses

కాంగ్రెస్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల ఇళ్లలో ఐటీ దాడుల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు, నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. నిన్న, నేడు తమ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోదీ - కేడీ బెంబేలెత్తుతున్నారన్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రమే ఐటీ దాడులు అన్నారు. ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.  
నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమన్నారు. 

నవంబర్ 10న చలో కామారెడ్డి

రేపు ఉదయం పది గంటలకు చలో కామారెడ్డి అంటూ రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. 

'కొలువులివ్వని కల్వకుంట్లను
పదవి పీకి పాతరేద్దాం
నివురు కప్పిన నిరుద్యోగి…
నిప్పు కణికై కదలిరా…
ఛలో కామారెడ్డి
నవంబర్ 10 
ఉదయం 10 గంటలకు' అని ట్వీట్ చేశారు. 

 

Link to comment
Share on other sites

Edi trs side aa

dr k laxman: ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది: బీజేపీ నేత లక్ష్మణ్ 

08-11-2023 Wed 22:16 | Telangana
  • తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే బీసీ సీఎం అవుతారన్న లక్ష్మణ్
  • సామాజిక న్యాయం కోసమే బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామని స్పష్టీకరణ
  • ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీయే అని వ్యాఖ్య
 
BJP Laxman says war one side in telangana

గతంలో నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే ఇక్కడి ప్రజలు ఆశీర్వదించారని, ఆ తర్వాత ఆయన ప్రధాని అయ్యారని, ఇప్పుడు పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. కొల్లాపూర్ నుంచి పలువురు బీజేపీలో చేరారు. వారికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ గెలిస్తే తెలంగాణకు బీసీ సీఎం అవుతారని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే బీజేపీని గెలిపించాలనుకుంటున్నట్లు చెప్పారు.

సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. బీసీ సీఎంను ప్రకటించడంతో బీసీలందరూ ఒక్కటయ్యారని, మిగతా వర్గాలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో కుటుంబ పార్టీ అయితే, కాంగ్రెస్ దేశంలో కుటుంబ పార్టీ అన్నారు. కానీ బీజేపీ దేశం కోసం పని చేసే పార్టీ అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ ప్రధాని ఆయితే రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం అవహేళన చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు. బీసీ సీఎంను ప్రకటిస్తే రెండు శాతం ఓట్లు వస్తాయని రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని సమీకరణాలు తీసుకొని 100 సీట్లకు గాను తాము 35 స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ అధికార పీఠాలు, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు బీసీలు ఒక్కటవుతున్నారన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇస్తే కూడా కేసీఆర్ సహించలేదన్నారు. కాంగ్రెస్, కేసీఆర్‌లలో ఎవరిని నమ్మినా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...