Jump to content

Tg political heat


psycopk

Recommended Posts

koushik reddy: గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే మీరు నా శవయాత్రకు రండి: బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

28-11-2023 Tue 18:57 | Telangana
  • హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి
  • ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యలు
  • ఇక ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్య
 
Huzurabad BRS Koushik Reddy hot comments

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి' అన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • lokesh_rjy

    1

Top Posters In This Topic

Ch Malla Reddy: ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు: మంత్రి మల్లారెడ్డి 

28-11-2023 Tue 18:27 | Telangana
  • అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలన్న మల్లారెడ్డి
  • రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్న మంత్రి
  • కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మవద్దని కోరిన మల్లారెడ్డి
 
Minister Mallareddy campaign in Ghatkesar

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటి వరకు ప్రజలు ఆశించిన అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాల్లో ముందుకు తీసుకు పోతున్నారని పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు కేసీఆర్‌ ఆదుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధి పట్టదన్నారు. అందుకే ఆ పార్టీల మాయమాటలు నమ్మవద్దన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ఘట్‌కేసర్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

KCR: కుట్రలు చేసే బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి?: ముఖ్యమంత్రి కేసీఆర్ 

28-11-2023 Tue 18:06 | Telangana
  • మోదీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినా, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శ
  • ఈ నెల 30వ తేదీన మనం గొర్రెలు కాదని నిరూపించుకోవాలన్న కేసీఆర్
  • కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదని వ్యాఖ్య
 
chief minister kcr says centre conspiracy on telangana

మన మీద కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్‍‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీ దేశం మొత్తం మీద 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, కానీ వందసార్లు అడిగినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలని, కానీ మనకు అలా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మనం ఏమైనా పిచ్చివాళ్లమా? అన్నారు. మనమంతా గొర్రెలం కాదని ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా నిరూపించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదన్నారు. కానీ వారు గెలిస్తే ఇందిరమ్మ రాజ్యమంటున్నారని... కానీ అది ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం అని ఆరోపించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, టీపీసీసీ అధ్యక్షుడేమో రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి నన్ను రెండుసార్లు గెలిపించారని, ఈసారి మళ్లీ ఆశీర్వదిస్తే ఐటీ టవర్లు తీసుకు వచ్చే బాధ్యత తనదే అన్నారు. మల్లన్న ముంపుసాగర్ బాధితులకు కాలుష్యరహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ట్రిపుల్ ఆర్ అయితే గజ్వేల్ దశ మారిపోతుందన్నారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: 'మీ రేవంతన్న సందేశం...' అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ 

28-11-2023 Tue 17:48 | Telangana
  • వందలాది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి
  • పదేళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శలు
  • కాంగ్రెస్ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి
 
Revanth Reddy message to Telangana people

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన వీడియోను విడుదల చేశారు. అరవై సంవత్సరాల పోరాటం.. వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను పదేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాబట్టి తెలంగాణ ప్రజలు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ వచ్చిందో ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు. సోనియమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. 

'మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.. ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.. చేయి చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం..' అని ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Telangana Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం... ఇప్పటి నుంచి వీటిపై నిషేధం! 

28-11-2023 Tue 17:37 | Telangana
  • సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రచారం
  • టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలు బంద్
  • ఎన్నికలకు సంబంధించి నేతలు ఇంటర్వ్యూలు ఇవ్వరాదు
 
Election campaigning ends in Telangana

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. నేతలు, అభ్యర్థులందరూ ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు కూడా మోడల్ కోడ్ మీడియా ముందస్తు అనుమతి ఉండాలి. ప్రచారాలకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు స్థానికంగా ఉండకూడదు. ఇతర ప్రాంతాల వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. రేపు, ఎల్లుండి ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు ఇవ్వరాదు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపకూడదు.

Link to comment
Share on other sites

CPI Narayana: చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారు: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు 

28-11-2023 Tue 17:13 | Both States
  • ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందన్న నారాయణ
  • అందుకే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని విమర్శ
  • బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ తీరును అందరూ గమనించారని వ్యాఖ్య
 
KCR and KTR tried to meet Chandrababu says CPI Narayana

ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉండటంతో ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. తెలంగాణలోని టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని.. కానీ, చంద్రబాబు ఒప్పుకోలేదని నారాయణ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందని... అందుకే బాబును కలిసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నించారని చెప్పారు. బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరును అందరూ గమనించారని అన్నారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండటం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని నారాయణ చెప్పారు. అందరికి సన్ స్ట్రోక్ ఉంటుందని... కానీ, కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేస్తోంది.

Link to comment
Share on other sites

CPI Narayana: చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారు: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు 

28-11-2023 Tue 17:13 | Both States
  • ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందన్న నారాయణ
  • అందుకే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని విమర్శ
  • బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ తీరును అందరూ గమనించారని వ్యాఖ్య
 
KCR and KTR tried to meet Chandrababu says CPI Narayana

ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉండటంతో ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. తెలంగాణలోని టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని.. కానీ, చంద్రబాబు ఒప్పుకోలేదని నారాయణ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందని... అందుకే బాబును కలిసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నించారని చెప్పారు. బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరును అందరూ గమనించారని అన్నారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండటం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని నారాయణ చెప్పారు. అందరికి సన్ స్ట్రోక్ ఉంటుందని... కానీ, కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేస్తోంది.

Link to comment
Share on other sites

Bandla Ganesh: ఆ సర్వేతో తనకు ఏ సంబంధం లేదని లగడపాటి చెప్పారు: బండ్ల గణేశ్ 

28-11-2023 Tue 16:38 | Entertainment
  • తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే చేయించారంటూ ప్రచారం
  • బీఆర్ఎస్ గెలవబోతోందని సర్వేలో తేలిందంటూ వార్తలు
  • ఈ వార్తలన్నీ బూటకమన్న బండ్ల గణేశ్
 
Lagadapati told me that he has no connection with that survey says Bandla Ganesh

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి సర్వే చేయించారని... బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవబోతోందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని సర్వేలో తేలిందనే వార్త వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ కు 67 నుంచి 72 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 39 నుంచి 44 వరకు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 6 వరకు, ఎంఐఎంకు 7 స్థానాలు, ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని సర్వేలో తేలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సినీ నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. తాను లగడపాటి రాజగోపాల్ తో మాట్లాడానని... ఆ సర్వేలకు, తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని వెల్లడించారు. ఈ వార్తలన్నీ బూటకమని చెప్పారు.

Link to comment
Share on other sites

Barrelakka: బర్రెలక్కకు ఏపీ నిరుద్యోగుల జేఏసీ మద్దతు 

28-11-2023 Tue 16:13 | Both States
  • ఒక్క వీడియోతో పాప్యులరైన బర్రెలక్క(కర్నె శిరీష)
  • కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ
  • తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బర్రెలక్క
 
AP Unemployed Youth JAC extends support to Barrelakka

ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నానంటూ కర్నె శిరీష అనే యువతి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో వైరల్ అయింది. దాంతో ఆమెను అందరూ బర్రెలక్క అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడా బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఆమెకు మద్దతుగా ఇటీవల ప్రచారం నిర్వహించారు. తాజాగా, బర్రెలక్క కర్నె శిరీషకు ఏపీ నిరుద్యోగుల జేఏసీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ప్రదర్శన నిర్వహించింది. 

ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు భారీగా హాజరై బర్రెలక్కకు మద్దతుగా నినాదాలు చేశారు. యువత మేలుకో... బర్రెలక్కను గెలిపించుకో అంటూ బ్యానర్ ను ప్రదర్శించారు. బర్రెలక్కకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని, అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Sonia Gandhi: మీరు నా మనసులో ఉన్నారు: తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం 

28-11-2023 Tue 16:01 | Telangana
  • ప్రియమైన సోదర... సోదరీమణులారా... నమస్కారం అంటూ సోనియా ప్రసంగం
  • దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలని పిలుపు
  • మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలన్న సోనియాగాంధీ
 
Sonia Gandhi message to Telangana people

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ మంగళవారం ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రియమైన తెలంగాణ సోదర.. సోదరీమణులారా.. నమస్కారం అంటూ సోనియాగాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నాను.. కానీ మీరంతా నా మనసులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నారు. సోనియమ్మ అంటూ తనపై ఎంతో ప్రేమ చూపించారని, మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినన్నారు. మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సందేశమిచ్చారు.

'2000 సంవత్సరంలో తెలంగాణ డిమాండ్ వెనక్కి తీసుకోమని సోనియాగాంధీ చెప్పారు' అన్న వార్తను.. అలాగే 2014లో 'ఏపీ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం', 'తెలంగాణ బిల్లు ఆమోదం వెనుక సోనియాగాంధీ' అంటూ వచ్చిన వార్తా క్లిప్పింగ్స్‌ను వీడియోలో పొందుపరిచారు. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ అంటూ తెలుగులో మాట్లాడారు... దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Kishan Reddy: ఎవడయ్యా హైదర్.. ఎవడికి కావాలి హైదర్?: కిషన్ రెడ్డి 

28-11-2023 Tue 15:59 | Telangana
  • బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న కిషన్ రెడ్డి
  • హైదరాబాద్ పేరును మార్చడంలో తప్పేముందని ప్రశ్న
  • బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి పేరును మారుస్తామని వ్యాఖ్య
 
We will change Hyderabad name to Bhagyanagar says Kishan Reddy

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎవడు హైదర్ అని అని ఆయన ప్రశ్నించారు. ఈ నగరానికి హైదర్ పేరు అవసరమా? అని అడిగారు. హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడని, ఎవడికి కావాలి హైదర్ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదర్ పేరు తీసేసి భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు. మద్రాస్ పేరును చెన్నైగా, బాంబేను ముంబైగా, కలకత్తాను కోల్ కతాగా, రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చినప్పుడు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేందని అన్నారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి ఒక్కదాని పేరును మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మేధావుల సలహాలను తీసుకుని మారుస్తామని తెలిపారు. ఆలోచనా విధానాల్లో కూడా మార్పును తీసుకొస్తామని అన్నారు. ముస్లింలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని... వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. 

Link to comment
Share on other sites

Etela Rajender: బీఆర్ఎస్ కండువా వేసుకోకుంటే తెలంగాణ గడ్డమీద బతకనివ్వమని బెదిరించే పరిస్థితి ఉంది: ఈటల విమర్శలు 

28-11-2023 Tue 15:36 | Telangana
  • దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్న ఈటల
  • పేదల వద్ద ఉన్న భూములు లాక్కున్నారని ఆరోపణ
  • కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని విమర్శలు
 
Etala Rajender in Gajwel SC athmeeya Sammelanam

బీఆర్ఎస్ కండువా వేసుకోకుంటే వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం.. కేసులు పెడతామని బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని విమర్శించారు. భూమి ఇవ్వకపోగా... పైగా పేదల వద్ద ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.

కొండపాక కలెక్టర్ కార్యాలయం కోసం 250 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాలు తీసుకున్నారని, మిగిలిన భూమిని ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు పేదలకు ఉండకూడదనే కేసీఆర్ అలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. 

 

Link to comment
Share on other sites

KCR: ఇందిరమ్మ రాజ్యమంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదు: కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు 

28-11-2023 Tue 14:45 | Telangana
  • తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని వ్యాఖ్య
  • భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సాధించుకున్నామన్న కేసీఆర్
  • రాజముద్రలో కాకతీయ తోరణం, చెరువుల కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టుకున్నామని గుర్తు చేసిన కేసీఆర్
  • తద్వారా కాకతీయ రాజులకు ఘన నివాళి అర్పించామన్న ముఖ్యమంత్రి
 
CM KCR hot comments on Indiramma Rajyam

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని, ఉద్యమంలో అతి భారీ బహిరంగసభ ఇక్కడే జరిగిందని, భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో మనం తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తాను అమ్మవారికి కిరీట ధారణ చేసి మొక్కు కూడా చెల్లించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేళ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఈ ఓరుగల్లు నిలిచిందని, ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

ఆయన మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చిందని, రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టామని తెలిపారు. అలాగే చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పెట్టుకున్నామన్నారు. తద్వారా కాకతీయ రాజులకు మనం నిజమైన నివాళి అర్పించామన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకున్న సమయంలో కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తనను ఆశీర్వదించారని వారిని స్మరించుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు తెలంగాణతో పాటు వరంగల్ నియోజకవర్గాల అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతున్నారని, కానీ అంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపారన్నారు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లలో వేశారని గుర్తు చేశారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యం కావాలా? అని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Telangana Assembly Election: అసెంబ్లీ ఎన్నికలు... తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు 

28-11-2023 Tue 14:20 | Telangana
  • ఎల్లుండి.. 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్
  • బుధవారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు
  • విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
 
Two days holidays for schools due to polling

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి... గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంతో పాటు తెలంగాణలోని పలుచోట్ల విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవును ప్రకటించారు.

Link to comment
Share on other sites

KTR: ముఖ్యమంత్రికి లోకల్... నాన్ లోకల్ ఉంటుందా?: కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ 

28-11-2023 Tue 14:04 | Telangana
  • కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అన్న కేటీఆర్
  • కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్న మంత్రి
  • తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్న కేటీఆర్
 
Minister KTR responds on KCR non local comments

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లోకల్... నాన్ లోకల్ అని ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారని.. కానీ ఇక్కడ తెలంగాణ సాధించిన సీఎం ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులలో ఎవరు లోకల్? అని ప్రశ్నించారు. కేసీఆర్ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్... అలాంటప్పుడు ఎవరు లోకల్? అని నిలదీశారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పెన్షన్‌కు కటాఫ్ తేదీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతామన్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...