Jump to content

Tg political heat


psycopk

Recommended Posts

IT Raids: పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు 

25-11-2023 Sat 12:28 | Telangana
  • తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
  • ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
  • లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
 
IT Raids in Pilot Rohit Reddy House

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ ఎంపీ, వీ6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తాండూరు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం ఉదయం మణికొండలోని పైలట్ నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటికి అధికారులు చేరుకున్నారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. 

ఈ సోదాల్లో పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ. 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా పైలట్ సోదరుడి ఇంటిలో రూ.20 లక్షలు గుర్తించినట్లు చెప్పారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • lokesh_rjy

    1

Top Posters In This Topic

Revanth Reddy: కోమటిరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా వికాస్ రాజ్ ఎత్తలేదు: రేవంత్ రెడ్డి 

25-11-2023 Sat 15:05 | Telangana
  • మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల పంపిణీ జరిగింది
  • ఈ విషయం గురించి చెప్పడానికి వికాస్ రాజ్ కు ఫోన్ చేస్తే ఎత్తలేదు
  • పదేళ్ల పాటు మోదీ, కేసీఆర్ ఆస్తులు పంచుకున్నారు
 
1000 Cr cash distributed from Ex IAS AK Goel residence

మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కోట్లాది రూపాయలను ఉంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి రూ. 1,000 కోట్లు పంపిణీ జరిగిందని చెప్పారు. ఆయన ఇంట్లో ఇంకా రూ. 300 కోట్లు ఉన్నాయని అన్నారు. ఈ విషయం గురించి చెప్పడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని మండిపడ్డారు. వికాస్ రాజ్ తో మాట్లాడేందుకు ఇద్దరు ఎంపీలం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఏకే గోయల్ ఇంట్లో ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదని అన్నారు. పదేళ్ల పాటు మోదీ, కేసీఆర్ ఆస్తులు పంచుకున్నారని చెప్పారు. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారని అన్నారు. ఎన్నికల సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఓటుకు రూ. 10 వేల పంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు ఇదే చివరి రైతుబంధు అని చెప్పారు.

Link to comment
Share on other sites

KTR: రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటే: మంత్రి కేటీఆర్ 

25-11-2023 Sat 15:44 | Telangana
  • కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఆరు నెలలకో సీఎంను మార్చడమేనని ఎద్దేవా
  • కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్న కేటీఆర్
  • ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు. అరాచక పాలన అని ఆగ్రహం
 
Minister KTR satires on TPCC chief Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలాంటి పార్టీని గెలిపిస్తే అంతే సంగతులు అన్నారు. కాంగ్రెస్ మార్పు అని అంటోందని.. అంటే ఆ మార్పు ఆరు నెలలకు ఓసారి ముఖ్యమంత్రిని మార్చడమని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లు, అరాచకాల పాలన తీసుకు వస్తారా? అని మండిపడ్డారు. 

మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని చెప్పారు. మనందరి కోసం పద్నాలుగేళ్ల పాటు ఢిల్లీ రాక్షసులతో పోరాడారన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచాక పెన్షన్ పెంచుతామన్నారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.

Link to comment
Share on other sites

YS Sharmila: సీఎంను కలవొద్దన్నప్పుడు జనం మీకు ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న 

25-11-2023 Sat 15:33 | Telangana
  • ఓట్లు వేసి గెలిపించింది సేవ చేయడానికా? గడీల్లో భోగాలు అనుభవించడానికా? అని నిలదీత
  • ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని మండిపాటు
  • ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు 
  • కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్న షర్మిల
 
YS Sharmila counter to Minister KTR

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాల్సిన అవసరం ఏముందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, అలాంటప్పుడు అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా? లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? అని నిలదీశారు. నాడు వైఎస్సార్ రచ్చబండలో ప్రజల నుంచి ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజాప్రభుత్వానికి చిరునామాగా నిలిచారన్నారు. క్యాంప్ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను విన్నారన్నారు. కానీ నేడు కేసీఆర్ చేస్తోంది నియంత పాలన అని మండిపడ్డారు.

ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని ఎద్దేవా చేశారు. అధికారం మత్తులో వారికి ప్రజాసమస్యలు కనిపించడం లేదన్నారు. ఇళ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా మీకు కనబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో వసతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావంటూ చురకలు అంటించారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారన్నారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్నారు.

Link to comment
Share on other sites

Ee chillar harish gadu inka divison dagare agi poyadu… eediki chepukotaniki emi ivaledu kcr .. 🤣

Harish Rao: సమైక్యవాదులకు మానుకోట చుక్కలు చూపింది... ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు చూపించండి: హరీశ్ రావు 

25-11-2023 Sat 16:24 | Telangana
  • సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట తరిమికొట్టిందని గుర్తు చేసిన మంత్రి
  • తెలంగాణ మీద దండెత్త‌డానికి వస్తోన్న ఢిల్లీ పార్టీల‌కు మానుకోట ద‌మ్ము చూపించాలని వ్యాఖ్య
  • కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో మోసం చేశారని విమర్శలు
 
Harish Rao election campain in manukota on saturday

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బూతులు తప్ప భవిష్యత్తు తెలియదని మంత్రి హరీశ్ రావు అన్నారు. మ‌హ‌బూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి శంక‌ర్ నాయ‌క్‌కు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్లు అడిగేందుకు వస్తోన్న బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు మానుకోట ద‌మ్మేంటో చూపించాల‌ని పిలుపునిచ్చారు. ఉద్యమం సమయంలో సమైక్యవాదులకు మానుకోట చుక్కలు చూపిందన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. మానుకోట మట్టికి, రాళ్లకు దండం పెడుతున్నానన్నారు. మానుకోట దెబ్బతో స‌మైక్య‌వాదులు వెనక్కి పరుగెత్తారని, ఇప్పుడూ అలాంటి చైత‌న్యం రావాలని ప్రజలనుద్దేశించి అన్నారు. తెలంగాణ మీద దండెత్త‌డానికి వ‌స్తోన్న ఢిల్లీ పార్టీల‌కు మానుకోట ద‌మ్మేంటో చూపించాల‌న్నారు. 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశార‌న్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా? బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అనేది ప్ర‌జ‌లు తేల్చుకోవాలన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీల సమావేశాలు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయ‌ని, బీఆర్ఎస్ సభలు జన సముద్రంలా ఉన్నాయ‌న్నారు. బీఆర్ఎస్ సుపరిపాలన అందిస్తోందని, కాబట్టి ప్రజలు రిస్క్ తీసుకోవద్దని సూచించారు. 

 

Link to comment
Share on other sites

Mallu Bhatti Vikramarka: 100 మంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును తాకలేరు: మల్లు భట్టి విక్రమార్క 

25-11-2023 Sat 17:11 | Telangana
  • మధిరలో 50వేల మెజార్టీతో గెలుస్తానని మల్లు భట్టి ధీమా
  • కేసీఆర్, కేటీఆర్ ఉడుత ఊపులకు మధిర భయపడదని వెల్లడి 
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
 
Mallu Bhatti Vikramarka speech in Madhira public meeting

ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఇక్కడకు వచ్చి తాను మధిర నుంచి మళ్లీ గెలవనని చెబుతున్నాడని, కానీ ఒక్క కేసీఆర్ కాదు... వందమంది కేసీఆర్‌లు వచ్చినా తన గెలుపును ఆపలేరని, కనీసం మధిర గేటు తాకలేరని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... తాను 50వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఉడుత ఊపులకు ఇక్కడ మధిర ప్రజలు భయపడరన్నారు. ఉద్యోగం రావడం కోసం అందరూ ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ను ఇస్తామన్నారు.

సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ మధిర అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో సంపద అందరికీ సమానంగా అందుతుందని, ప్రజారంజక పాలన వస్తుందని భావిస్తే ఆ ఆశలు నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రమే దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రావాలంటే... రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే... హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు.

Link to comment
Share on other sites

Yogi Adityanath: ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్ 

25-11-2023 Sat 17:00 | Telangana
  • వేములవాడలో ప్రచారాన్ని నిర్వహించిన యోగి
  • తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని విమర్శ
  • గతంలో యూపీలో కూడా తెలంగాణ పరిస్థితులే ఉండేవని వ్యాఖ్య
 
KCR is afraid of Owaisi says Yogi Adityanath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితర కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. 

అవినీతి పాలనతో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టేశారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను నిర్వీర్యం చేశాయని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా తెలంగాణలాంటి పరిస్థితులే ఉన్నాయని... కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని చెప్పారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే... ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.

Link to comment
Share on other sites

barrelakka shirisha: బర్రెలక్క శిరీష తరఫున కొల్లాపూర్‌లో జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం 

25-11-2023 Sat 16:46 | Telangana
  • శిరీషలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీనారాయణ పిలుపు
  • శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానేనని వ్యాఖ్య
  • శిరీషకు వచ్చిన గుర్తు కూడా అందరినీ జాగృతం చేసే ఈల అన్న జేడీ లక్ష్మీనారాయణ
 
Laxminarayana campaign for Barrelakka shirisha in kollapur

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో బర్రెలక్క కర్నె శిరీష తరఫున ప్రచారం నిర్వహించారు. శనివారం ఆయన స్వయంగా కొల్లాపూర్‌కు వెళ్లి ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మన వద్ద పార్టీస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శిరీష లాంటి వారు అవసరమన్నారు. శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అన్నారు. ఇలాంటివాళ్లు ఎందరికో రోల్ మోడల్ అవుతారన్నారు. చాలామంది పని చేశారు... చాలా పార్టీలు పని చేశాయి.. కానీ మనం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు.

యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన అంశమన్నారు. శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, కాబట్టి దానిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. శిరీషకు ఈల గుర్తు వచ్చిందని, ఇది తనకు బాగా నచ్చిందన్నారు. దీంతో మనం అందరినీ జాగృతం చేయాలన్నారు. మీరు శిరీషను అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ వేసే ఈలలను అక్కడ సభలో ఈల వేసి వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

DK Shivakumar: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్ కృషి చేశారు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ 

25-11-2023 Sat 17:27 | Telangana
  • తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్న డీకే శివకుమార్
  • హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవల పిల్లల వంటివని వ్యాఖ్య
  • తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇచ్చే సమయం వచ్చిందన్న డీకే శివకుమార్
 
DK Shivakumar praises TDP chief chandrababu and YSR

హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవల పిల్లల వంటివన్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దేశమే కాదు... ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు బహుమతి ఇచ్చే సమయం వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటక గురించి కేసీఆర్, కేటీఆర్ తెలుసుకుంటే మంచిదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

GVL Narasimha Rao: తెలంగాణలో ఎవరి ఊహకు అందని ఫలితాలు వస్తాయి: జీవీఎల్ నర్సింహారావు 

25-11-2023 Sat 19:13 | Telangana
  • నరేంద్రమోదీ ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని బీసీలకు సూచన
  • బీసీ ముఖ్యమంత్రి నినాదంపై నిశ్శబ్ద విప్లవం మొదలైందని వెల్లడి
  • బీసీలు ఈ అవకాశం వినియోగించుకోకుంటే వందేళ్లయినా మళ్లీ రాదని వ్యాఖ్య
 
GVL Narasimha Rao comments on BC Chief Minister

బీసీలకు ప్రధాని నరేంద్రమోదీ మంచి అవకాశమిచ్చారని... దీనిని తప్పకుండా వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ చెప్పిందే చేస్తారనే విషయం అందరికీ తెలుసునని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంపై నిశ్శబ్ద విప్లవం మొదలైందని, ఎవరి ఊహకు అందని ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. బీసీలు ఈ అవకాశం వినియోగించుకోకుంటే వందేళ్లయినా మళ్లీ రాదన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ భూబకాసుర పార్టీ అని విమర్శలు గుప్పించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పూర్తిస్థాయి శిక్ష పడాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ముస్లింలకు ఐటీ పార్కా... ఇంత దిగజారుడు రాజకీయాలు ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ మాట వేరే దేశాలు వింటే నవ్వుతాయన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఇక్కడే బీజం పడిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారని గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేశారని, కవిత, అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు. కోడ్ వర్డ్స్‌తో చాటింగ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో తాను అనేక ప్రాంతాల్లో తిరిగానని, అన్నిచోట్ల ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు.

Link to comment
Share on other sites

Manda Krishna Madiga: బీజేపీలో చేరిన మంద కృష్ణ సోదరుడు 

25-11-2023 Sat 19:41 | Telangana
  • హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరిన మంద కృష్ణ సోదరుడు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటల రాజేందర్
  • మాదిగల సమస్యను మోదీ గుర్తించి పరిష్కరిస్తున్నందునే బీజేపీలో చేరినట్లు ఈటల వెల్లడి
 
Manda Krishna Madiga brother joins BJP

మంద కృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. ఆయనకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... 30 ఏళ్లుగా జాతి పడుతున్న బాధను ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకొని, సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని గుర్తించి, బీజేపీ కండువాను కప్పుకోవడానికి ఆయన వరంగల్ నుంచి గజ్వేల్‌‌కి వచ్చారని తెలిపారు. కార్నెల్‌కు పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. 

 

Link to comment
Share on other sites

Pawan Kalyan: బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందునే బీజేపీకి మద్దతు: పవన్ కల్యాణ్ 

25-11-2023 Sat 18:37 | Telangana
  • తెలంగాణలో బీసీల చేతికి రాజ్యాధికారం రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్ష
  • తనకు ఏపీ జన్మనిస్తే... తెలంగాణ పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్య
  • తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటానన్న పవన్ కల్యాణ్
 
Pawan Kalyan reveals why he is supporting bjp

బీజేపీ బీసీలకు రాజ్యాధికారం ఇస్తోందని, తాను ఆ పార్టీకి మద్దతివ్వడానికి ప్రధాన కారణం ఇదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శనివారం వికారాబాద్ జిల్లా తాండూలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్‌గౌడ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో బీసీల చేతికి రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. తనకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే, పునర్జన్మనిచ్చింది తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తాను రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతానన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రావాలని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Priyanka Gandhi: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ప్రభుత్వం వస్తుందని సోనియాగాంధీ ఆశపడ్డారు: ప్రియాంక గాంధీ 

25-11-2023 Sat 18:03 | Telangana
  • మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందన్న ప్రియాంకగాంధీ
  • రాహుల్ భారత్ జోడో యాత్ర తరహా తెలంగాణలో భట్టి పాదయాత్ర చేశారని కితాబు
  • పేపర్ లీకులు జరుగుతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్న ప్రియాంకగాంధీ
  • తాను 30 నిమిషాలు మాట్లాడితే మూడుసార్లు కరెంట్ పోయిందని వ్యాఖ్య
 
Priyanka Gandhi public meeting in Madhira

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజా ప్రభుత్వం వస్తుందని సోనియాగాంధీ ఆశపడ్డారని, కానీ ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రజల ఆశలు నెరవేరలేదని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మధిరలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నానన్నారు. నిన్న రాత్రి సోనియాగాంధీకి ఫోన్ చేశానని, రేపు భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నట్లు చెప్పానన్నారు. భట్టి తెలంగాణ కోసం ఎంతో ఉద్యమించారని ఆమె గుర్తు చేసుకున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహా తెలంగాణలో భట్టి పాదయాత్ర చేశారని కితాబునిచ్చారు. వీరు తమ పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయడానికి బలమైన ప్రభుత్వం రాబోతుందని సోనియా గాంధీ బలంగా నమ్ముతున్నారన్నారు. ప్రజల బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. పెరిగిన ధరలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పేపర్ లీకులు జరుగుతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. తాను 30 నిమిషాలు మాట్లాడితే మూడుసార్లు కరెంట్ పోయిందన్నారు.

Link to comment
Share on other sites

Nuvvu emana takkuva tinava tuppas yedava

Narendra Modi: కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది.. ఆ పార్టీకి ప్రాణమిత్రుడు: నరేంద్రమోదీ 

25-11-2023 Sat 17:44 | Telangana
  • గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేసిన మోదీ
  • కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్‌కు జిరాక్స్ అని వ్యాఖ్య
  • ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోందన్న మోదీ
 
PM Modi public meeting in Maheswaram

కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణమిత్రుడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి ప్రారంభమైందని, అలాగే గతంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్‌కు జిరాక్స్ వంటిదేనని మోదీ ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. కానీ తాము బీసీని సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న అధికారులతో భేటీ అయ్యానని, వర్గీకరణ రోడ్డు మ్యాప్ తయారు చేయాలని వారికి సూచించినట్లు చెప్పారు. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను అవినీతిలో నెంబర్ వన్‌గా నిలిపిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని, అప్పుడు ధరలు తగ్గుతాయన్నారు. 

 

Link to comment
Share on other sites

🤣🤣india motham mere kada ra karanam

 

Amit Shah: ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం: అమిత్ షా 

25-11-2023 Sat 20:02 | Telangana
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి అన్న అమిత్ షా
  • బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్లేనని హెచ్చరిక
  • బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందని వెల్లడి
  • బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత తమ పార్టీదే అన్న అమిత్ షా
 
Amith Shah targets KCR for hike of petrol and diesel price

డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి అని, అలాగే దేశంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీని గెలిస్తే దేశానికి భద్రత మరింతగా సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పటాన్‌చెరులో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ వేలకోట్లు దోచుకున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ పార్టీ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి చెందిన ఓవైసీకి ఓటేసినట్లు అవుతుందన్నారు. బీజేపీ గెలిచాక తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతోందని, కశ్మీర్‌ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీని గెలిపిస్తే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. కేసీఆర్ వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...