Jump to content

Tg political heat


psycopk

Recommended Posts

KTR: గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టింది: కేటీఆర్ 

26-11-2023 Sun 13:29 | Telangana
  • గోషామహల్‌లో బీజేపీని ఓడిస్తామన్న కేటీఆర్
  • రైతుబంధు పాత పథకమే కాబట్టి ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టీకరణ
  • రాహుల్ గాంధీ 2014 నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నారని విమర్శ
 
Minister KTR says BRS will win Goshamahal this time

గోషామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గోషామహల్‌లో ఈసారి బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు కింద అందే సాయంపై విమర్శలు చేస్తున్నారని, కానీ అది కొత్త పథకం కాదని గుర్తించాలన్నారు. ఇప్పటికే ఉన్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష వల్లే కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని తెలిపారు.

నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడే దీక్షా దీవస్‌ను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల పైన మాత్రమే జరుగుతున్నాయని చెప్పడం సరికాదన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్ర సన్యాసం చేశారన్నారు. తెలంగాణకు స్వీయపాలన శ్రీరామ రక్ష అన్నారు.

రాహుల్ గాంధీ రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారని, 2014 నుంచి ఆయనకు ఉద్యోగం లేదని ఎద్దేవా చేశారు. ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • lokesh_rjy

    1

Top Posters In This Topic

Amit Shah: ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవి: అమిత్ షా 

26-11-2023 Sun 13:42 | Telangana
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణ
  • ప్రజాప్రతినిధులు ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే పార్టీ విధానంగా మారిందని విమర్శలు
  • కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని వ్యాఖ్య
 
Amit Shah public meeting in Makthal

ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే ఆ పార్టీ ఎమ్మెల్యేల విధానంగా మారిందని మండిపడ్డారు.

బీజేపీ గెలిస్తే మక్తల్, నారాయణపేటలలో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్‌కు వేసినట్లే అవుతుందని, వారు కేసీఆర్‌కు అమ్ముడుపోతారని ఆరోపించారు.

Link to comment
Share on other sites

Rahul Gandhi: ఢిల్లీలో మోదీకి కేసీఆర్ సహకారం... తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకారం: రాహుల్ గాంధీ 

26-11-2023 Sun 13:51 | Telangana
  • తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటున్నారని విమర్శ
  • తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపణ
  • ధరణి పోర్టల్‌ను గుప్పెట్లో పెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని ఆగ్రహం
 
Rahul Gandhi says brs is helping bjp in delhi

బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉందని, ఢిల్లీలో నరేంద్రమోదీకి కేసీఆర్ సహకరిస్తారు... తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకరిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం నాడు ఆందోల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఎన్నో కలలు.. ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కేవలం తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు.

ల్యాండ్.. శాండ్.. మైన్స్.. వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను గుప్పెట్లో పెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. పరీక్ష పేపర్లు లీక్ కావడం వల్ల ఎంతోమంది ఉద్యోగ అభ్యర్థులు నష్టపోయారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై తొలి కేబినెట్ సమావేశంలోనే సంతకం చేస్తామన్నారు. 

 

Link to comment
Share on other sites

Harish Rao: ఢిల్లీ కాలుష్యం అంతా హైదరాబాద్‌ను కమ్మేసింది: మంత్రి హరీశ్ రావు వ్యంగ్యం 

26-11-2023 Sun 15:46 | Telangana
  • ఢిల్లీ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • ఢిల్లీ నుంచి వస్తున్న నేతలు మూడు రోజుల తర్వాత కనిపించరన్న హరీశ్ రావు
  • ఇప్పుడు నేను వెళ్త బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకుంటున్నారన్న మంత్రి
 
Minister Harish Rao satires on bjp and congress

ఢిల్లీ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి ఉంటుందని మంత్రి హరీశ్ రావు వ్యంగ్యం ప్రదర్శించారు. రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇటీవల ఢిల్లీ కాలుష్యం అంతా హైదరాబాద్‌ను కమ్మేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన.. వస్తున్న నేతలు అందరూ మూడు రోజుల తర్వాత కనిపించరని వ్యాఖ్యానించారు. ఈ మూడు రోజులు ఢిల్లీ కాలుష్యాన్ని భరించాల్సిందే అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై హరీశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ మూడోసారి కచ్చితంగా గెలుస్తుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించాలన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుకునే వారమని, ఇప్పుడు నేను వెళ్త బిడ్డా సర్కారు దవాఖానాకు అని పాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

Link to comment
Share on other sites

Oka cm aai undi aa place datta tesukunta ee place datta tesukunta endi ra… anni places develop cheata anali kani

KCR: ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి: కేసీఆర్ 

26-11-2023 Sun 16:00 | Telangana
  • ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న కేసీఆర్
  • తాను పిలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించిన ముఖ్యమంత్రి
  • ఖానాపూర్‌ను కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పారన్న కేసీఆర్
 
CM KCR talks about Indiramma Rajyam

ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ బాగుపడలేదని, ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖానాపూర్, జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరమ్మ హయాంలోనే అని, 400 మందిని కాల్చి చంపింది కూడా ఆమె హయాంలోనే అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నీటిపై కూడా పన్ను విధిస్తే, దానిని తాము రద్దు చేశామని చెప్పారు. 

ఖానాపూర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో సాఫ్ట్ వేర్‌ కంపెనీ ఉందని తెలిపారు. తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారన్నారు. జాన్సన్‌ నాయక్‌ను గెలిపిస్తే ఖానాపూర్‌ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదని దాని పని మటాష్ అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఏం చేసిందో ఆలోచించి... ప్రజలు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓటు వేయవద్దని హెచ్చరించారు. "జాన్సన్ నాయక్ నా కొడుకు రామ్‌ (కేటీఆర్) కు క్లాస్‌మేట్‌. మొన్న రామ్‌ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఇక రామారావు దత్తత తీసుకున్నాక మీకేం తక్కువవుతుంది? కాబట్టి మీరు జాన్సన్‌ నాయక్‌కు ఓటేస్తే నాకు వేసినట్టే లెక్క. మంచి మెజారిటీతో జాన్సన్‌ నాయక్‌ను గెలిపించండి" అని కోరారు. నీలాంటి యువకుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెబితే జాన్సన్‌ నాయక్‌ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

Link to comment
Share on other sites

barrelakka shirisha: బర్రెలక్క శిరీష ధైర్యంగా ముందుకు సాగుతోంది... మనందరికీ ఆదర్శం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

26-11-2023 Sun 16:27 | Telangana
  • మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందని వ్యాఖ్య
  • గెలిచి ప్రజల కష్టాలను, తన కష్టాలను అసెంబ్లీలో వినిపిస్తానని చెబుతోందన్న లక్ష్మీనారాయణ
  • బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి
 
CBI former JD Laxminarayana on Barrelakka

బర్రెలక్క కర్నె శిరీష ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ముందుకు సాగుతోందని.. ఆమె కూడా మనందరికీ ఆదర్శమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మూస రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరముందన్నారు. వీజే డిగ్రీ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వస్తే తాను ప్రోత్సహిస్తుంటానని, కొల్లాపూర్ నుంచి బర్రెలక్క కర్నె శిరీషకు కూడా తాను మద్దతు తెలుపుతున్నానని... 
ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. తాను గెలిచి.. తన కష్టాలను, ప్రజాసమస్యలను కచ్చితంగా అసెంబ్లీలో వినిపిస్తానని ఆమె చెబుతోందని, అలాంటప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

శిరీషను తాను నిన్న కలిసి ధైర్యాన్ని... భరోసాను ఇచ్చి ప్రోత్సహించానన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని... నాయకులు.. పార్టీలు అవే ఉంటుంటే కొత్తవారు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. కాబట్టి యువతరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడు చెబుతుంటానని, అలా వచ్చే వారిని ప్రోత్సహిస్తానన్నారు. యువతం నిర్ణయించుకుంటే భారత భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. అందుకే యువతరానికి తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పారు. తానూ పోటీ చేస్తానన్నారు. 

Link to comment
Share on other sites

Jagga Reddy: సంగారెడ్డి పులి... జగ్గారెడ్డి భుజంపై చేయివేసి మెచ్చుకున్న రాహుల్ గాంధీ 

26-11-2023 Sun 17:08 | Telangana
  • రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో ఆసక్తికర పరిణామాలు
  • ఇందిరాగాంధీపై పాట పాడిన వృద్ధురాలు.. హిందీలో రాహుల్‍కు అర్థమయ్యేలా వివరించిన జగ్గారెడ్డి
  • పెద్దపులి అంటూ జగ్గారెడ్డికి కితాబు.. తన యాత్రలో కష్టపడి పని చేశారని వ్యాఖ్య
  • 1980లలో ఇందిరా గాంధీ ఇదే వేదిక మీద మాట్లాడినట్లు గుర్తు చేసిన జగ్గారెడ్డి
 
Rahul Gandhi praises Jagga Reddy in Sangareddy meeting

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వేదికపై ఓ వృద్ధురాలు ఇందిరమ్మపై పాట పాడారు. ఇందిరాగాంధీ ఇల్లు, భూమి... ఇవ్వడంతో పాటు ఎంతో చేశారంటూ ఆమె ఇచ్చిన పథకాలను పాట రూపంలో వినిపించారు. ఆ వృద్ధురాలు తెలుగులో పాడారు. దీంతో జగ్గారెడ్డి ఆమె ఏం పాడారో హిందీలో వివరించారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకొని భుజంపై చేయి వేసి మెచ్చుకున్నారు. అంతకుముందు ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ... జగ్గారెడ్డి పెద్దపులి అని ప్రశంసించారు. ఆయన కష్టపడి పని చేస్తారని, భారత్ జోడో యాత్రలో ఆయన ఎలా కష్టపడి పని చేస్తారో చూశానన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తైన తర్వాత జగ్గారెడ్డి ఆయనకు మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఇదే మైదానంలో 1980లలో మీ నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రసంగించారని తెలిపారు. రాహుల్ గాంధీ వెళ్తున్న సమయంలో తన కుటుంబ సభ్యులను, ఇతరులను పరిచయం చేశారు. తనకు రాహుల్ గాంధీ ప్రేమ తప్ప ఏదీ అవసరం లేదన్నారు.

కేసీఆర్‌పై కేసు పెట్టలేదు

సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తాను ప్రధాని మోదీపై పోరాటం చేస్తున్నానని, తనపై 24 కేసులు పెట్టి 60 గంటల పాటు ఈడీ తనను విచారించిందని గుర్తు చేశారు. తన అధికారిక కార్యాలయాన్ని కూడా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రతి బీదవాడి గుండెల్లో నేను ఉన్నాను.. కాబట్టి ఆ ఇల్లు తనకు అవసరం లేదని చెప్పానన్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఒక్క కేసు పెట్టలేదన్నారు. వారిద్దరు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్.. వీరిద్దరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని మండిపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే చోట్ల మజ్లిస్ పార్టీ పోటీ చేసి బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని ఆరోపించారు.

Link to comment
Share on other sites

Yogi Adityanath: తెలంగాణ ఓటర్లకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆసక్తికర ఆఫర్ 

26-11-2023 Sun 18:04 | Telangana
  • బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్య రామాలయ దర్శనం ఉచితమన్న యోగి
  • నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉందన్న యూపీ సీఎం
  • రామమందిర నిర్మాణం కాంగ్రెస్ వల్ల సాధ్యమయ్యేదా? అని ప్రశ్న
 
Yogi Adityanath public meeting in Mahaboobnagar

తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందన్నారు. దేశంలో ఎలాంటి అలజడులు లేవన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాంగ్రెస్ వల్ల అయ్యేదా? అని ప్రశ్నించారు. నడుస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని, అవినీతిపరులను వదిలే ప్రభుత్వం కాదన్నారు.

ఎయిమ్స్, ఐఐటీ, జిల్లాకో మెడికల్ కాలేజీ, ఇంటింటికి నల్లా వంటి అనేక పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ మాఫియా మాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులమయంగా చేశారని ఆరోపించారు. 

మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా మార్చటం కోసమే వచ్చానని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. యూపీలో మాఫియాను బుల్డోజర్‌తో అణిచివేశామన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అన్నారు. యూపీలో ఆరేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, తెలంగాణలో మాత్రం పేపర్ లీక్‌‌లతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

CPI Narayana: కేసీఆర్... నిరాహార దీక్ష సమయంలో నువ్వు జ్యూస్ తాగిన విషయం మరిచిపోయావా?: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు 

26-11-2023 Sun 18:22 | Telangana
  • డాక్టర్ గోపినాథ్‌ను అడిగితే కేసీఆర్ ఎంత నిబద్ధతతో దీక్ష చేశారో తెలుస్తుందన్న నారాయణ
  • కేసీఆర్ జ్యూస్ తాగితే ఓయూ విద్యార్థులు ఆగ్రహించడంతో మళ్లీ మాట మార్చారన్న నారాయణ
  • ఐటీ దాడుల తీరు చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలుస్తోందని వ్యాఖ్య
 
CPI Narayana interesting comments on KCR deeksha

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని చెబుతున్న కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం నాడు కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చావునోట్లో తలపెటట్టి తెలంగాణ తెచ్చానని చెబుతున్నారని, కానీ ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ గోపినాథ్‌ను అడిగితే కేసీఆర్ ఎంత నిబద్ధతతో దీక్ష చేశారో తెలుస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు.

డాక్టర్ గోపినాథ్ ఈ దీక్షకు సంబంధించిన పూర్తి నివేదికను తమకు అందించారన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మరిచిపోతే ఎలా? అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల అంశంపై కూడా నారాయణ స్పందించారు. వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి రాగానే అవినీతిపరుడు అయ్యాడా? అని ప్రశ్నించారు. ఐటీ దాడుల తీరు చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ తెలిసిపోతుందన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదని విమర్శించారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతుబంధుకు ఎలా అనుమతించారు? అని నిలదీశారు.

Link to comment
Share on other sites

Siddaramaiah: మా హామీలపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 

26-11-2023 Sun 19:57 | National
  • కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు... కురిసిన ఓట్ల వర్షం
  • అదే ఫార్ములా తెలంగాణలోనూ పనిచేస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు
  • కర్ణాటకలో ఇప్పటివరకు హామీలు అమలు చేయడంలేదంటున్న బీఆర్ఎస్ నేతలు
  • కావాలంటే వచ్చి విచారణ చేసుకోవచ్చన్న కర్ణాటక సీఎం సిద్ధరామమయ్య
 
Karnataka CM Siddaramaiah reacts to KCR remarks

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ... అదే హామీల ఫార్ములాతో తెలంగాణలోనూ నెగ్గాలని ఆశిస్తోంది. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయడంలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై కర్ణాటక  సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 

ఐదు గ్యారంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని వెల్లడించారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వాటిని ఆమోదించామని స్పష్టం చేశారు. కావాలంటే, కర్ణాటకలో తమ హామీల అమలుపై విచారణ చేసుకోవచ్చని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

తమ హామీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ప్రతి రోజూ 62 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ హామీలతో మహిళలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. తన భార్య కూడా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నట్టు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...