Jump to content

Tg political heat


psycopk

Recommended Posts

KCR: ఆ పేరే నాకు ఆకాశమంత... అంతకుమించి ఏ పదవి అవసరం లేదు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు 

26-11-2023 Sun 20:47 | Telangana
  • తెలంగాణ తీసుకు వచ్చిన పేరే తనకు చాలన్న కేసీఆర్
  • పదేళ్ళు సీఎంగా ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు లేరని, ఆ ఘనత తనకు దక్కిందని వ్యాఖ్య
  • జీవితంలో ఏదో కావాలనే కోరిక తనకు లేదన్న ముఖ్యమంత్రి
 
KCR interesting comments in Jagityal Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం జగిత్యాల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే తనకు ఆకాశమంత అని... ఆ పేరు చాలని, అంతకుమించిన పదవి ఏదీ లేదన్నారు. తాను ప్రజల మద్దతుతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని, తెలుగు రాష్ట్రాలలో వరుసగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు ఎవరూ లేరని, అది తనకు దక్కిందన్నారు. జీవితంలో ఇంకా ఏదో కావాలనే కోరికలు తనకు లేవన్నారు. తన పోరాటం పదవుల కోసం కాదని వ్యాఖ్యానించారు.

తాను కొట్లాడేది తన పదవి కోసం కాదన్నారు. వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలనేది తన లక్ష్యం అన్నారు. కేరళ రాష్ట్రం మాదిరి వందశాతం అక్షరాస్యత... ప్రతి రైతు గుండెమీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయే విధంగా దిగుబడి, ప్రతి ఇంటికి నీళ్లు... వీటి కోసమే తన పోరాటం అన్నారు. తనకు డెబ్బై ఏళ్ళు వచ్చాయని, ఇంకా ఈ జీవితంలో ఏం కావాలన్నారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే... పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • lokesh_rjy

    1

Top Posters In This Topic

12 minutes ago, psycopk said:

KCR: ఆ పేరే నాకు ఆకాశమంత... అంతకుమించి ఏ పదవి అవసరం లేదు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు 

26-11-2023 Sun 20:47 | Telangana
  • తెలంగాణ తీసుకు వచ్చిన పేరే తనకు చాలన్న కేసీఆర్
  • పదేళ్ళు సీఎంగా ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు లేరని, ఆ ఘనత తనకు దక్కిందని వ్యాఖ్య
  • జీవితంలో ఏదో కావాలనే కోరిక తనకు లేదన్న ముఖ్యమంత్రి
 
KCR interesting comments in Jagityal Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం జగిత్యాల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే తనకు ఆకాశమంత అని... ఆ పేరు చాలని, అంతకుమించిన పదవి ఏదీ లేదన్నారు. తాను ప్రజల మద్దతుతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని, తెలుగు రాష్ట్రాలలో వరుసగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు ఎవరూ లేరని, అది తనకు దక్కిందన్నారు. జీవితంలో ఇంకా ఏదో కావాలనే కోరికలు తనకు లేవన్నారు. తన పోరాటం పదవుల కోసం కాదని వ్యాఖ్యానించారు.

తాను కొట్లాడేది తన పదవి కోసం కాదన్నారు. వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలనేది తన లక్ష్యం అన్నారు. కేరళ రాష్ట్రం మాదిరి వందశాతం అక్షరాస్యత... ప్రతి రైతు గుండెమీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయే విధంగా దిగుబడి, ప్రతి ఇంటికి నీళ్లు... వీటి కోసమే తన పోరాటం అన్నారు. తనకు డెబ్బై ఏళ్ళు వచ్చాయని, ఇంకా ఈ జీవితంలో ఏం కావాలన్నారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే... పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

@ARYA lion 🦁 lokesh should break this record

Link to comment
Share on other sites

Pushpams next level comedy.. center lo power lo unna vishyam marichinwtu unnaru

 

Yogi Adityanath: బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుంది: యోగి ఆదిత్యనాథ్ 

26-11-2023 Sun 21:12 | Telangana
  • బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని వ్యాఖ్య
  • తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
 
Yogi Adityanath Election campaign in Hyderabad

తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ రోడ్డు షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే... నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారని, కుటుంబ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.

Link to comment
Share on other sites

KCR: ఉస్మానియా విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ దీక్ష రూటు మార్చారు: సీపీఐ నారాయణ 

27-11-2023 Mon 08:52 | Telangana
  • చావు నోట్లో తలపెట్టానని కేసీఆర్ చెప్పడం బూటకమని ఆరోపించిన సీసీఐ నేత
  • తానే ప్రత్యక్ష సాక్షినని, ఉద్యమం నీరుగార్చొద్దనే అప్పట్లో చెప్పలేదన్న నారాయణ
  • కొత్తగూడెంలో సీపీఐ తరపున ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు
 
KCR Diksha route changed due to concern of Osmania students in movement says CPI Narayana

రాష్ట్ర సాధన ఉద్యోమంలో 1200 మంది యువత బలిదానాల కారణంగా మాత్రమే తెలంగాణ ఏర్పాటైందని, కానీ అది తానొక్కడి సాధనే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం చావునోట్లో తలపెట్టానని కేసీఆర్‌ చెప్పడం బూటకమని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దీక్ష మొదలు పెట్టి విరమించేందుకు ప్రయత్నించాడని, అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టడంతో కేసీఆర్ అనివార్యంగా రూటుమార్చాడని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షినని నారాయణ ఆరోపించారు. ఆ నాటి నుంచి కేసీఆర్ ఉస్మానియాకు వెళ్లే ధైర్యం చేయడంలేదని, తెలంగాణ ఉద్యమం నీరుగారొద్దనే ఉద్దేశ్యంతోనే అప్పట్లో ఈ విషయాలను బయటకు చెప్పలేదని నారాయణ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం సీపీఐ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలిపించాలని ప్రచారం చేశారు. పట్టణంలోని శేషగిరిభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అస్తమించే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, జలగం వెంకట్రావుకి ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. నిస్వార్థంగా ప్రజాఉద్యమంలో శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న సాంబశివ రావుని గెలిపించాలని అభ్యర్థించారు.

మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. పోలింగ్‌కు ముందు ‘రైతుబంధు’ నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినివ్వడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మైత్రిని తెలియజేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని తొలగించి రాష్ట్రానికి బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ చెబుతుండడం హాస్యాస్పదమని నారాయణ అన్నారు. 30 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతుండడం వెనుక బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం దాగి ఉందని ఆరోపించారు.

Link to comment
Share on other sites

Amit Shah: కేసీఆర్ మళ్లీ గెలిస్తే రాహుల్ బాబాను ప్రధాని చేసేందుకు ప్రయత్నిస్తాడు: అమిత్ షా 

27-11-2023 Mon 17:42 | Telangana
  • కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న అమిత్ షా
  • ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ రావాలని ఆశిస్తున్నారన్న కేంద్రమంత్రి
  • రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు విఫలమవుతాయన్న అమిత్ షా
 
Amit Shah satires on congress and kcr

తెలంగాణలో కేసీఆర్ మరోసారి గెలిస్తే కాంగ్రెస్ నేత రాహుల్ బాబాను ప్రధానిని చేసేందుకు ప్రయత్నిస్తాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ రావాలని ఆశిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లే అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అమ్ముడుపోతారన్నారు. 

రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ ప్రభుత్వం రాదని చురకలు అంటించారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచనదినోత్సవం జరపడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి భయపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను తాము బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాదిగల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామన్నారు. బీజేపీ గెలవగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తుందని పునరుద్ఘాటించారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేస్తామని ప్రకటించారు.

Link to comment
Share on other sites

Narendra Modi: హుజూరాబాద్‌లో ట్రైలర్ చూపించాం.. ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తాం: ప్రధాని మోదీ 

27-11-2023 Mon 17:23 | Telangana
  • తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని ధీమా 
  • అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ
  • కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం
 
PM Narendra Modi says BJP will win in Telangana election

హుజూరాబాద్ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్‌కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆట ముగియనుందని జోస్యం చెప్పారు. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు... ఆ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు అవసరం లేదన్నారు. గ్యారెంటీలను నెరవేర్చే మోదీ సర్కార్ తెలంగాణకు అవసరమన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం... మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం... మోదీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత అన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఓ వైపు ప్రజలను మోసం చేసిన కేసీఆర్... మరోవైపు మీ సేవకుడు మోదీ ఉన్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Link to comment
Share on other sites

KCR: మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయి: కేసీఆర్ 

27-11-2023 Mon 15:48 | Telangana
  • ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయన్న కేసీఆర్
  • కాంగ్రెస్ వల్లే రైతుబంధు ఆగిపోయిందని విమర్శ
  • గులాబీ జెండాతో అందరం పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్న ముఖ్యమంత్రి
 
KCR fires on Congress

ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... ఎవరైనా మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని... రైతుల వేలిముద్ర లేకుండా భూరికార్డులను మఖ్యమంత్రి కూడా మార్చలేరని అన్నారు. 

రైతుబంధు ఆపాలని గత నెలలోనే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు. తాను విన్నవిస్తే... ఈ నెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతుబంధును మళ్లీ ఆపేసిందని తెలిపారు. 

తెలంగాణను 1956లో ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ విమర్శించారు. మన తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని.. తాను నిరాహారదీక్షకు కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తల వంచిందని అన్నారు. గులాబీ జెండాను పట్టుకుని అందరం పోరాడిన తర్వాతే తెలంగాణను ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్ర కూడా చూడాలని అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Narendra Modi: సచివాలయం కూల్చివేత... కేసీఆర్‌పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు 

27-11-2023 Mon 14:42 | Telangana
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని విమర్శలు
  • ముఢవిశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని మండిపాటు
  • ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్న
 
PM Modi hot comments on KCR over secretariate issue

సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని దుయ్యబట్టారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, బీఆర్ఎస్‌లోని అవినీతిపరులను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు.

Link to comment
Share on other sites

Narendra Modi: హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో... రెండు మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత 

27-11-2023 Mon 14:04 | Telangana
  • భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌ల మూసివేత
  • చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేయనున్న అధికారులు
  • సాయంత్రం గం.4.30 నుంచి గం.6.30 వరకు మూసివేత
 
Two Metro Rail Stations will closed due to PM Modi road show

హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌లను ఈ రోజు సాయంత్రం మూసివేయనున్నారు. నేటి మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆర్చ్, ఓల్డ్ వైఎంసీఏ పోలీస్టేషన్ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

KTR: కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలి?: మంత్రి కేటీఆర్ 

27-11-2023 Mon 13:48 | Telangana
  • కేసీఆర్ మూడోసారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తామని హామీ
  • కాంగ్రెస్ గెలవకముందే రైతుల నోట్లో మట్టికొట్టిందని ఆగ్రహం
  • అభివృద్ధితో దూసుకెళ్తున్న తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టవద్దన్న కేటీఆర్
 
Minister KTR fires at Congress over rythu bandhu issue

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎవరికీ న్యాయం జరగదన్నారు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రైతుబంధును నిలిపివేయించిందని, తద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి పదకొండుసార్లు అధికారం ఇస్తే ఏం చేసింది? అని నిలదీశారు. ధరణిని రద్దు చేసి పట్వారీ వ్యవస్థను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ కొత్తదేమీ కాదని, అదో చెత్త పార్టీ అన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారని, కానీ పదకొండుసార్లు అధికారంలో ఉండి కనీసం తాగునీరు, సాగునీరు, కరెంట్, పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. సంక్షేమం కాకుండా ప్రజల జీవితాలను ఆగం చేశారన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.

కేసీఆర్ ఏం చేశారు? అని కాంగ్రెస్ అడుగుతోందని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, రూ.2వేల పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను తీసుకు వచ్చింది ఆయనే అన్నారు. రైతును బాగు చేసిన కేసీఆర్‌ను కాదని ఆరు దశాబ్దాలు మనల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌ను తీసుకువద్దామా? అని ప్రశ్నించారు. కేసీఆర్ గొంతు పిసికేస్తే తెలంగాణ గురించి అడిగేవాళ్లు ఉండరనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుంచి అగ్రనాయకులు రాష్ట్రంపై దండెత్తుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధితో దూసుకు వెళ్తున్న తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టవద్దని హెచ్చరించారు.

Link to comment
Share on other sites

Asaduddin Owaisi: కాంగ్రెస్ పార్టీ రైతుబంధును ఎందుకు అడ్డుకుందో అర్థం కావట్లేదు: అసదుద్దీన్ ఓవైసీ 

27-11-2023 Mon 13:29 | Telangana
  • రైతుబంధు పథకం పాతదేనని స్పష్టం చేసిన అసదుద్దీన్
  • పంట సాయాన్ని రైతులకు చేరకుండా కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శలు
  • పాత పథకాన్ని అడ్డుకోవడం ద్వారా రైతు వ్యతిరేకిగా తేటతెల్లమైందన్న అసదుద్దీన్
 
Asaduddin Owaisi responds on Rythu Bandu halting

రైతుబంధు పథకం పాతదేనని... అయినా కాంగ్రెస్ దీనిని ఎందుకు అడ్డుకుంటుందో.. ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇది కొత్త పథకం అయి ఉంటే అప్పుడు ఆపవచ్చునని గుర్తు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుబంధు కింద వచ్చే పంట సాయాన్ని రైతులకు చేరకుండా కాంగ్రెస్ అడ్డుకుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈ పథకం చాలా ఏళ్లుగా అమలులో ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అని ప్రశ్నించారు. ఇది కొత్త పథకం అయితే భిన్నంగా ఆలోచించేవాళ్లమన్నారు. కానీ పాత పథకాన్ని హఠాత్తుగా అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీ రైతు వ్యతిరేకమని తేటతెల్లమైందన్నారు. రైతుబంధును అడ్డుకోవ‌డం అంటే కాంగ్రెస్ పార్టీ త‌ప్పుడు సంకేతాలు పంపుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని విమర్శించారు. 

 

Link to comment
Share on other sites

G. Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి: కిషన్ రెడ్డి 

27-11-2023 Mon 13:05 | Telangana
  • ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధును ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్న
  • కుటుంబ పార్టీలను బీజేపీ వదిలిపెట్టదన్న కిషన్ రెడ్డి
  • హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని పునరుద్ఘాటన
 
Kishan Reddy blames brs and congress over rythu bandhu issue

రైతుబంధు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధును ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అని మండిపడ్డారు. ఆ రెండు కూడా కుటుంబ పార్టీలేనని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలను బీజేపీ వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను ప్రజలు చూశారని, బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీలపై తమ పోరాటం ఆపేది లేదన్నారు. అసలు హైదరాబాద్ పేరు ఏమిటి? ఎవరీ హైదర్? అందుకే భాగ్యనగరంగా మారుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే చాలా నగరాల పేర్లు మారాయని గుర్తు చేశారు. పాతబస్తీని అభివృద్ధి చేయాలనేది తమ డిమాండ్ అన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం కోసమే తాము ట్రిపుల్ తలాక్ రద్దు చేశామన్నారు.

Link to comment
Share on other sites

KCR: కేసీఆర్ ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా: రేవంత్ రెడ్డి 

27-11-2023 Mon 11:46 | Telangana
  • కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్న టీపీసీసీ చీఫ్
  • అమ్మగారి ఊరు కేసీఆర్ కు 40 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందంటూ ఎద్దేవా
  • కామారెడ్డి భూములను మింగేందుకే ఇక్కడికి వచ్చిండని ఆరోపణ
 
TPCC Chief Revanth Reddy Tweet On KCR

గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరికే దొరకలేదని అన్నారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు.

పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా అల్లుళ్లకు లేదు: రేవంత్ రెడ్డి 

27-11-2023 Mon 11:01 | Telangana
  • రైతుబంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ
  • హరీశ్ రావు వ్యాఖ్యలే దీనికి కారణమని ఈసీ చెప్పిందన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ వచ్చిన వెంటనే రైతు భరోసా డబ్బులు వేస్తామని హామీ
 
Revanth reddy fires on KCR and Harish Rao

రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప... నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామ, అల్లుళ్లకు లేదని ఆయన అన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో మీ ఖాతాల్లో రూ. 15 వేల రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

Lol harish gadu silent ga pedutunadu ga …

Rythu Bandhu: రైతుబంధుకు బ్రేక్.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలే కారణం! 

27-11-2023 Mon 10:26 | Telangana
  • నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసిన ఈసీ
  • రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైనం
  • ఎన్నికల ప్రచారంలో రైతుబంధును ప్రస్తావించవద్దని షరతు
  • ఈ నిబంధనను ఉల్లంఘించిన మంత్రి హరీశ్ రావు
 
EC withdraws permission to Telangana govt to disburse instalment under Rythu Bandhu Scheme

తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రైతుబంధు నిధుల విడుదలకు ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ నిబంధనలను మంత్రి హరీశ్ రావు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం రైతుబంధు విషయంలో రెండు రోజుల క్రితం ఈసీ సానుకూల నిర్ణయం వెలువరించింది. రైతుబంధు నిధులు విడుదల చేయడానికి అనుమతినిచ్చింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని గుర్తుచేస్తూ.. రైతుబంధు నిధుల విడుదల అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించ వద్దని షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ది పొందే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. ఈసీ అనుమతించడంతో ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే, ఈసీ తాజా ఆదేశాల కారణంగా నిధుల విడుదల మరింత ఆలస్యం కానుంది. 

ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలకు మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్ రావు రైతుబంధు నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి మాటలను మీడియా ఆదివారం హైలైట్ చేసింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో రైతుబంధు నిధులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

20231127fr656428378a622.jpg
20231127fr6564284548553.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...