Jump to content

Tg political heat


psycopk

Recommended Posts

IT Raids: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. అధికారులను చూసి స్పృహ కోల్పోయిన సంపత్‌కుమార్ భార్య 

27-11-2023 Mon 10:03 | Telangana
  • అర్ధరాత్రి 12 గంటల సమయంలో అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటికి చేరుకున్న ఐటీ, విజిలెన్స్ అధికారులు
  • వారిని చూసి హైబీపీతో స్పృహ తప్పి పడిపోయిన మహాలక్ష్మి
  • అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
  • సంపత్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు
  • పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
 
IT Raids On Alampur Congress Candidate Sampath Kumar

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల ఇళ్లపై ఇప్పటికే దాడులు చేసిన అధికారులు తాజాగా అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన సంపత్‌కుమార్ నివసిస్తున్న వడ్డపల్లి మండలం శాంతినగర్‌లోని ఆయన నివాసానికి గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేరుకున్న ఐటీ, విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు.

ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సంపత్‌కుమార్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అధికారులను చూసి కంగారుపడిన సంపత్ భార్య మహాలక్ష్మి హైబీపీతో స్పృహతప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తనిఖీల సమయంలో సంపత్ ఇంట్లో లేరని సమాచారం. ఐటీ దాడుల సమాచారం అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు రోడ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Link to comment
Share on other sites

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • lokesh_rjy

    1

Top Posters In This Topic

Rythubhandu: రైతుబంధును ఆపేయడంపై హరీశ్ రావు స్పందన 

27-11-2023 Mon 12:01 | Telangana
  • కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందన్న మంత్రి
  • పంపిణీకి అనుమతిచ్చాక కూడా మళ్లీ ఫిర్యాదు
  • కాంగ్రెస్ లీడర్ నిరంజన్ ఫిర్యాదు వల్లే ఈసీ నిర్ణయం
 
Telangana Minister Harish Rao Reaction On Rythubhandu Scheme stopping

రైతుబంధు పంపిణీని నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా ఆదేశాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ రైతులపై, రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందని అన్నారు. రైతన్నలకు సాయం అందకుండా కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పంపిణీ చేయొచ్చంటూ ఈసీ అనుమతిచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తన దుర్బుద్ధిని వదులుకోలేదని మండిపడ్డారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేయడం వల్లే రైతుబంధు పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.

రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపిందనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోవాలంటూ తెలంగాణ ప్రజలు, రైతులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతోనే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Priyanka Gandhi: తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు: ప్రియాంక గాంధీ 

27-11-2023 Mon 15:28 | Telangana
  • బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన ప్రియాంక గాంధీ
  • ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన, చిత్తశుద్ధి లేవని ఆగ్రహం
  • మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపు
 
Priyanka Gandhi road show in Bhuvanagiri

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నేడు భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు, విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేవని దుయ్యబట్టారు.

ఏడేళ్ల క్రితం నోట్ల రద్దు సమయంలో ప్రజలు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దకు డబ్బుల కోసం వెళ్లి ఎంతగా ఇబ్బంది పడ్డారో మనమంతా చూశామని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కరోనా మనకు ఇబ్బందులను తీసుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలంటే... మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరి విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిద్రపోతోందని విమర్శించారు.

Link to comment
Share on other sites

Mallu Bhatti Vikramarka: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ.. దేవాలయంలో రూ.100 స్టాంప్‌పై మల్లు భట్టి సంతకం 

27-11-2023 Mon 20:18 | Telangana
  • ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తమదేనన్న మల్లు భట్టి
  • మధిర నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతానని హామీ
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతామని వ్యాఖ్య
 
Mallu Bhatti signs on Rs 100 stamp over six guarentees

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలని కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామ దేవాలయంలో... రూ.100 స్టాంప్‌పై సంతకం చేసి, ప్రమాణం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత తమదే అన్నారు. తాను మధిర నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతామని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

KTR: ఓటర్లందరికీ పర్సనల్‌గా కేటీఆర్ ఫోన్.. మీకూ కాల్ వచ్చిందా..? 

27-11-2023 Mon 19:47 | Telangana
  • ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్న మంత్రి కేటీఆర్
  • సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేశానో వివరిస్తున్న కేటీఆర్
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరణ
  • మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న కేటీఆర్
 
Minister KTR phone call to Siricilla and Hyderabad voters

'హలో.. నేను కేటీఆర్‌ను మాట్లాడుతున్నా..' అంటూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల, హైదరాబాద్‌లలోని ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు! కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు భాగ్యనగరవాసులకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తున్నారనుకునేరు.... ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తాను ఏం అభివృద్ధి చేశానో వివరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే చాలామందికి వచ్చింది. 

Link to comment
Share on other sites

KTR: ఓటర్లందరికీ పర్సనల్‌గా కేటీఆర్ ఫోన్.. మీకూ కాల్ వచ్చిందా..? 

27-11-2023 Mon 19:47 | Telangana
  • ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్న మంత్రి కేటీఆర్
  • సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేశానో వివరిస్తున్న కేటీఆర్
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరణ
  • మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న కేటీఆర్
 
Minister KTR phone call to Siricilla and Hyderabad voters

'హలో.. నేను కేటీఆర్‌ను మాట్లాడుతున్నా..' అంటూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల, హైదరాబాద్‌లలోని ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు! కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు భాగ్యనగరవాసులకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తున్నారనుకునేరు.... ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తాను ఏం అభివృద్ధి చేశానో వివరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే చాలామందికి వచ్చింది. 

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

KTR: ఓటర్లందరికీ పర్సనల్‌గా కేటీఆర్ ఫోన్.. మీకూ కాల్ వచ్చిందా..? 

27-11-2023 Mon 19:47 | Telangana
  • ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్న మంత్రి కేటీఆర్
  • సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేశానో వివరిస్తున్న కేటీఆర్
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరణ
  • మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న కేటీఆర్
 
Minister KTR phone call to Siricilla and Hyderabad voters

'హలో.. నేను కేటీఆర్‌ను మాట్లాడుతున్నా..' అంటూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల, హైదరాబాద్‌లలోని ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు! కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు భాగ్యనగరవాసులకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తున్నారనుకునేరు.... ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తాను ఏం అభివృద్ధి చేశానో వివరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే చాలామందికి వచ్చింది. 

naku kuda call vachindi bro

ragane tiger revanth anna song vinipicha

venatne memu adhikaram loki ragane ne anthu chustha ani call cut chesadu

  • Haha 1
Link to comment
Share on other sites

State Election Commission: బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు

27-11-2023 Mon 22:26 | Telangana
  • 'స్కాంగ్రేస్' అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై నోటీసులు జారీ
  • కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం
  • ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
EC issues noties to BRS for scangress ads

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. 'స్కాంగ్రేస్' అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఈవో వికాస్ రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరవై నాలుగు గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాము చేసిన పనులు... చేయబోయే పనులు.. అలాగే విపక్షాల ప్రభుత్వాలు అవినీతిమయం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వదులుతున్నాయి. స్కాంగ్రేస్' అంటూ బీఆర్ఎస్ ప్రకటనలు ఇవ్వడంపై ఈసీ తాజాగా నోటీసులు ఇచ్చింది.

Link to comment
Share on other sites

Thummala: సెటిలర్స్ అనే మాట తీసేయాలి... ఇది మన గడ్డ... ఇక్కడే జీవిస్తున్నాం: హైదరాబాద్‌లో తుమ్మల

27-11-2023 Mon 22:05 | Telangana
ఎన్టీఆర్ ఆత్మగౌరవ రాజకీయాలు నేర్పితే చంద్రబాబు ఆత్మవిశ్వాస రాజకీయాలు నేర్పారన్న తుమ్మల
చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వ్యాఖ్య
కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలన్న తుమ్మల
Tummala Nageswara Rao campaign in Hyderabad

సెటిలర్స్ అనే మాట తీసేయాలి... ఇది మన గడ్డ... ఇక్కడే జీవిస్తున్నాం... ఎవడబ్బ సొత్తు కాదని కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం... రామరాజ్యాన్ని చూశామన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ రాజకీయాలు నేర్పితే ఆత్మవిశ్వాస రాజకీయాలు నేర్పింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలన్నారు.

ఐటీ టవర్లు.. ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వంటి వాటితో హైదరాబాద్‌ కు విశ్వనగరంగా చంద్రబాబు పునాది వేశారన్నారు. 2020 విజన్‌తో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. 

రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటుతో సోనియాగాంధీ చరిత్రలో నిలిచారన్నారు. తెలంగాణలో దారుణమైన పాలన ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు మాఫియాగా మారారని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కాంగ్రెస్ మార్పును కోరుతోందన్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

Link to comment
Share on other sites

BRS: శేరిలింగంపల్లిలో ఎన్నికల విచిత్రం... బీఆర్ఎస్ అభ్యర్థికి స్థానిక తెలంగాణ టీడీపీ డివిజన్ల అధ్యక్షుల మద్దతు

27-11-2023 Mon 21:32 | Telangana
  • బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు టీటీడీపీ డీవిజన్ల అధ్యక్షుల ప్రకటన
  • అభివృద్ధితో పాటు స్థానిక పరిస్థితులను బట్టి మద్దతిచ్చినట్లు వెల్లడి
  • అరికెపూడి గాంధీకి మద్దతిస్తున్నట్లు ప్రకటన
TTDP is supporting brs candidate in Sherilingampally

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి ఆ పార్టీ అండగా ఉంటోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు స్థానిక తెలంగాణ టీడీపీ డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వారు వెల్లడించారు. అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ మాత్రం తాము అరికెపూడి గాంధీకి మద్దతిస్తున్నామని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ మేరకు కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట, ఆల్విన్ కాలనీ డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. ఇక్కడ ఉన్న నాయకుల్లో అందరినీ సమానంగా చూసే నాయకుడు అరికెపూడి గాంధీ అని, అందుకే తాము సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వారు తెలిపారు.

Link to comment
Share on other sites

EC: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడం పట్ల కర్ణాటక ప్రభుత్వంపై ఈసీ సీరియస్

27-11-2023 Mon 21:27 | Telangana
  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
  • నవంబరు 30న పోలింగ్
  • తెలంగాణ కాంగ్రెస్ కు మద్దతుగా కర్ణాటక సర్కారు ప్రకటనలు
  • కర్ణాటక ప్రకటనలకు తమ అనుమతి లేదన్న ఈసీ
  • వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక సీఎస్ కు లేఖ
EC serious on Karnataka govt

కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ఎన్నికల ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కర్ణాటకు సీఎస్ కు లేఖ రాసింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఎన్నికల ప్రకటనలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈ సందర్భంగా ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఎన్నికల ప్రకటనలు నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది.

Link to comment
Share on other sites

Narendra Modi: తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

27-11-2023 Mon 21:12 | Telangana
  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన రోడ్డు షో
  • మోదీ వెంట కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్
  • కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ
PM Modi road show in Hyderabad

తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షో అనంతరం కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. రోడ్డు షోతో మోదీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Link to comment
Share on other sites

6 hours ago, Raja_Returns said:

naku kuda call vachindi bro

ragane tiger revanth anna song vinipicha

venatne memu adhikaram loki ragane ne anthu chustha ani call cut chesadu

:giggle:

Link to comment
Share on other sites

Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం 

28-11-2023 Tue 06:35 | Telangana
  • సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు
  • ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్
  • అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టిన పార్టీలు
 
Telangana election campaign is over today

దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో  మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. టీవీలు, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ (మోడల్ కోడ్ మీడియా కమిటీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే సంసిద్ధమయ్యారు.

Link to comment
Share on other sites

Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికలు.. రాజకీయ ఎస్ఎమ్మెస్‌లపై నిషేధం 

28-11-2023 Tue 10:09 | Telangana
  • మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 వరకూ సైలెన్స్ పీరియడ్
  • ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయ, బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం ఉంటున్న కరీంనగర్ అలెక్టర్
  • పరిస్థితులను నిత్యం గమనిస్తుంటామని హెచ్చరిక
 
Ban on bulk sms for a period of 48 hours before Telangana General elections

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుందని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎమ్ఎస్‌ల ప్రసారంపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్ఎంఎస్‌లు ప్రసారాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. 

కాగా, పోలింగ్ కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి కరీంనగర్‌లో ఎన్నికల ఏర్పాట్లపై విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి కూడా పాల్గొన్నారు.   

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...