Jump to content

ఆ మూడు చోట్ల కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులు..


Peruthopaniemundhi

Recommended Posts

ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం అవాస్తవమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

KTR: ఆ మూడు చోట్ల కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులు: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం అవాస్తవమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్రసన్యాసం చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అని చెప్పారు.

29న దీక్షా దివస్‌

కేసీఆర్‌ దీక్షతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఆరోజు భారాస శ్రేణులు ఎక్కడి వారు అక్కడే దీక్షా దివస్‌ను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

రాహుల్‌.. కర్ణాటకలో ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇచ్చారా?

‘‘గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. రేవంత్‌రెడ్డికి భాజపాపై ప్రేమ ఉంది. గోషామహల్‌లో భాజపా అభ్యర్థిని ఓడిస్తాం. రైతుబంధు కొత్త పథకం కాదు.. కొన్నేళ్లుగా అది కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదు. రాహుల్‌గాంధీ ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు.. అసలు దరఖాస్తే చేయలేదు. రాహుల్‌కు ఉద్యోగమంటే ఏంటో తెలుసా? నేను పరీక్షలు రాశా.. ఇంటర్వ్యూలకు హాజరయ్యా.. ఉద్యోగమూ చేశా.

 

కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. రాహుల్‌.. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ అయినా విడుదల చేశారా? దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి.  కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ వంచించిన మాట వాస్తవం కాదా?ఆర్నెల్ల కిందే కహానీలు చెప్పి మాటతప్పిన మాట వాస్తవం కాదా? దేశంలో ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదు. కావాలంటే లిస్ట్‌ పంపిస్తాం.. రాహుల్‌ గాంధీ చూసుకోవచ్చు’’ అని కేటీఆర్‌ అన్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...