Jump to content

Nara Lokesh: జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి: లోకేశ్


psycopk

Recommended Posts

Ayyanna Patrudu: 'దొంగ సాయిగా' అంటూ విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు 

28-11-2023 Tue 14:10 | Andhra
  • ఎవరు నడవమన్నారో అంటూ లోకేశ్ పై విజయసాయి సెటైర్లు
  • మీ అల్లుడు నత్తి పకోడీగాడిని ఎవరు నడవమన్నారంటూ అయ్యన్న కౌంటర్
  • 3 నెలల తర్వాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావట అంటూ ఎద్దేవా
 
Ayyanna Patrudu strong counter to Vijayasai Reddy

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రలో నడక భారమై లోకేశ్ బిత్తర సవాళ్లు విసురుతున్నాడని విజయసాయి ఎద్దేవా చేశారు. గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. 

మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి? అని అయ్యన్న ప్రశ్నించారు. క‌నిపించిన‌వాళ్ల‌క‌ల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర‌ అని దుయ్యబట్టారు. న‌డ‌వ‌లేక కోర్టు వాయిదాల పేరుతో యాత్ర‌ని వాయిదా వేసుకోవ‌డం మీ దొంగ‌ల్లుడికే చెల్లు అని అన్నారు. పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బ‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి వ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగ‌సాయి... మూడు నెల‌ల త‌రువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావ‌ట‌ అని ఎద్దేవా చేశారు. స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కించి, పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించి... బొక్క‌లో వేస్తాంరా దొంగ సాయిగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా...!: నారా లోకేశ్ 

28-11-2023 Tue 18:12 | Andhra
  • కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి
  • లోకేశ్ తో తన కష్టాలు చెప్పుకున్న దుర్గారెడ్డి అనే విద్యార్థి
  • చలించిపోయిన లోకేశ్ 
 
Nara Lokesh offers helping hand to a poor student

యువగళం పాదయాత్రలో ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.దుర్గారెడ్డి తమ కష్టాలను లోకేశ్ కు తెలియజేశాడు. “నేను అమలాపురంలోని ఎస్ కేబీఆర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటీఐ చదువుతానని నాన్నతో చెబితే ... మనకు అంత స్థోమత లేదు, వద్దన్నారు. దాంతో టీసీ తీసుకొని ఇంటి వద్దే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను” అని చెప్పాడు.

దీంతో లోకేశ్ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని అక్కడిక్కడే ప్రకటించారు. అంతేకాదు, ఆ విద్యార్థి వివరాలు తీసుకోవాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. 

 

  • Haha 2
Link to comment
Share on other sites

Nandamuri Vasundhara: జిరాక్స్ యంత్రం కోసం బాలకృష్ణ గారు బ్రాహ్మణిని దాదాపు డిమాండ్ చేశారు: వసుంధర 

28-11-2023 Tue 18:49 | Andhra
  • హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య అర్ధాంగి
  • పలు స్కూళ్లలో జరిగిన కార్యక్రమాలకు హాజరు
  • రూ.8 లక్షల విలువైన వస్తువులు అందజేత
  • భవిష్యత్తులో మరింత సాయం అందిస్తామన్న వసుంధర 
 
Nandamuri Vasundhara attends programs in Hindupur constituency

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ఇవాళ నియోజకవర్గంలో పర్యటించారు. పలు హైస్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లేపాక్షి మండలం శిరివరం జిల్లా పరిషత్ హైస్కూల్, చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి హైస్కూల్ లో జరిగిన జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. హెరిటేజ్ సంస్థ సహకారంతో ఆయా హైస్కూళ్లకు రూ.8 లక్షల విలువైన వస్తువులను అందించారు. విద్యార్థులకు జ్ఞాపికలు, మెడల్స్ బహూకరించారు. 

ఈ సందర్భంగా నందమూరి వసుంధర మాట్లాడుతూ, విద్యార్థులందరినీ చూస్తుంటే బాల్యంలో తాను చదువుకున్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ముఖాల్లో తేజస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, భవిష్యత్తులో వారు కూడా అబ్దుల్ కలాం, జగదీశ్ చంద్రబోస్, చంద్రయాన్ శాస్త్రవేత్తల తరహాలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. 

దేమకేతేపల్లి పాఠశాలకు జిరాక్స్ యంత్రం అత్యవసరమని తెలియడంతో బాలకృష్ణ గారు బ్రాహ్మణిని దాదాపుగా డిమాండ్ చేశారని వసుంధర వెల్లడించారు. దాంతో బ్రాహ్మణి వెంటనే స్పందించి జిరాక్స్ యంత్రం సమకూర్చినట్టు వివరించారు. ఇదే కాకుండా, భవిష్యత్తులోనూ ఈ పాఠశాలకు మరింత సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కాగా, ఈ కార్యక్రమంలో పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Nara Lokesh: అది చంద్రబాబుతోనే సాధ్యం: నారా లోకేశ్ 

28-11-2023 Tue 22:21 | Andhra
  • కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం
  • నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పాదయాత్ర
  • భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి
 
Lokesh Yuvagalam Padayatra details on 211th day

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 211వ రోజు అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. పాదయాత్ర అమలాపురం పట్టణానికి చేరుకోగానే మహిళలు హారతులు పడుతూ లోకేశ్ కు నీరాజనాలు పలికారు. 

అనాతవరం వద్ద యువగళం పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించించింది. ముమ్మడివరం ఇన్ ఛార్జి దాట్ల సుబ్బరాజు నేతృత్వంలో లోకేశ్ కు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు, అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో యువతతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు.

రాబోయే ఎన్నికల్లో యూత్ పవర్ ను జగన్ కు చూపాలి!

రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకం, యువత పవర్ ఏంటో యువ ఓటర్లు మొదటి సారి జగన్ కి చూపించాలి. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మార్పు రావాలి అనుకోవడం కాదు... మార్పు కోసం మీరు ముందుకు రావాలి. ఏపీలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది... జగన్ ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కియా, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. జగన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వచ్చాయి. 

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తాం

విద్యా దీవెన, వసతి దీవెన అంటూ కొత్త పథకాలు తెచ్చి వ్యవస్థను జగన్ నాశనం చేశాడు. దీని వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ , జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్ లా జాబ్ లెస్ క్యాలెండర్ కాదు... ప్రతి ఏడాది ఒక పద్దతి ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. 

నూతన విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులకు జగన్ కోత పెడుతున్నాడు. జగన్ భర్తీ చేస్తానన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేదు. జగన్ పాలనలో ఆక్వాకి, వరి, ఇతర రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏపీలో కేవలం గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర ఉంది.

ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనం చేసిన జగన్

టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసింది. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మేర ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తాం. ఫిజియోథెరపీ విలువ నాకు పాదయాత్ర ప్రారంభించిన తరువాత తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ పోస్టులు కల్పించేలా అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం

రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేకుండా చేశాడు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇతర జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. జగన్ ప్రభుత్వం అడ్వకేట్లను కూడా ఇబ్బంది పెడుతోంది. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాల పరిష్కారం కోర్టులో కాకుండా రాజకీయ నాయకులు ప్రమేయంతో జరిగే వ్యవస్థ తీసుకురావాలని అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులపై పెత్తనం చెయ్యాలని జగన్ ఆలోచిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం బాబువల్లే సాధ్యం

జగన్ పాలన ముగిసే సరికి ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరుతుంది. జగన్ గ్రోత్ ఇంజిన్ ని ఆపేశాడు. జగన్ వలన రాష్ట్రం పరువు పోయింది. అమర్ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశాడు. విశాఖ మిలీనియం టవర్స్ కి నేను తెచ్చిన ఐటీ కంపెనీలను తరిమేసి సచివాలయం చేస్తానని జగన్ అంటున్నాడు. రాష్ట్రంపై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రం పరువు నిలబెట్టడం ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం.

లోకేశ్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు

అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పీవీ రావు మాలమహానాడు ప్రతినిధులు నారా లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. "మీరు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం" అని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

అందుకు లోకేశ్ స్పందిస్తూ....

"నా ఎస్సీలు, నా బీసీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం" అని స్పష్టం చేశారు.

=====

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2886.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.5 కి.మీ.*

*212వరోజు (29-11-2023) యువగళం వివరాలు*

*అమలాపురం/ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు*

*ఉదయం*

10.00 – ముమ్మిడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.15 – ముమ్మిడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో భేటీ.

10.30 – ముమ్మిడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశం.

11.00 – ముమ్మిడివరం సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

మధ్యాహ్నం

 
12.45 – ముమ్మిడివరం పల్లెపాలెం సెంటర్ లో దళితులతో సమావేశం.

1.30 – కొమనాపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.

2.30 – అన్నంపల్లి సెంటర్ లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ.

3.30 – మురమళ్ల సెంటర్ లో బుడగ జంగాలతో సమావేశం.

3.45 – మురమళ్లలో భోజన విరామం.

*సాయంత్రం*

5.00 – మురమళ్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

6.00 – కొమరగిరిలో స్థానికులతో సమావేశం.

7.15 – ఎదుర్లంక సెంటర్ లో స్థానికులతో సమావేశం.

7.30 – పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

9.00 – సుంకరపాలెం విడిది కేంద్రంలో బస.

******
20231128fr6566128f433a3.jpg20231128fr656612a9cb06e.jpg20231128fr656612cad4ac6.jpg

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...