Jump to content

Exit polls favoring congress


psycopk

Recommended Posts

Exit Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో... కాంగ్రెస్ పార్టీకే మొగ్గు! 

30-11-2023 Thu 17:55 | Telangana
  • నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఓటింగ్
  • సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్
  • అధికార బీఆర్ఎస్ కు రెండో స్థానం
 
Exit Polls revealed for Telangana assembly elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దాదాపు తెలంగాణలో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గుచూపుతుండడం విశేషం. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీ కంటే ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా జనసేన పార్టీ ఊసు ఎత్తలేదు.

 
వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...
 
తెలంగాణలో  మొత్త అసెంబ్లీ స్థానాల సంఖ్య- 119
 
ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే...
 
కాంగ్రెస్- 58 నుంచి 67 స్థానాలు
బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు
బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు
ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు
 
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్...
 
కాంగ్రెస్- 67 నుంచి 78 స్థానాలు
బీఆర్ఎస్- 22 నుంచి 31 స్థానాలు
బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు
ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు
 
సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్...
 
కాంగ్రెస్- 65 స్థానాలు
బీఆర్ఎస్- 41 స్థానాలు
బీజేపీ- 4 స్థానాలు
ఇతరులు- 9 స్థానాలు
 
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్...
 
కాంగ్రెస్-56 స్థానాలు
బీఆర్ఎస్- 48 స్థానాలు
బీజేపీ- 10 స్థానాలు
ఇతరులు- 5 స్థానాలు
 
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్...
 
కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు
బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు
ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్...
 
కాంగ్రెస్- 48 నుంచి 64 స్థానాలు
బీఆర్ఎస్- 40 నుంచి 55 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 13 స్థానాలు
ఎంఐఎం- 4 నుంచి 7 స్థానాలు
  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, Sucker said:

Babu garini jail lo vepisthe aa power yela vuntundho chupistham Kachara ki 

KTR gaadi press meet vinu. G balupu. TRS ee gelustundi kaani, veedu ippatiki iche responses ki odipothe bagunnu.

Link to comment
Share on other sites

Revanth Reddy: డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

30-11-2023 Thu 18:55 | Telangana
  • ఈ రోజు నుంచి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్
  • కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నారని చెప్పిన రేవంత్
  • బీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని వ్యాఖ్య
 
Congress will form a transparent government sasy TPCC Chief Revanth Reddy

తెలంగాణలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారను. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నుంచి సంబరాలు చేసుకోవచ్చు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న క్షమాపణ చెప్తారా అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  ప్రజలంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని చెప్పారు. ఓడిపోతామని తెలిసినప్పుడు కేసీఆర్ నియోజకవర్గం మారతారు.   బీఆర్ఎస్ పార్టీకి 25కి మించి ఒక్క సీటు కూడా పెరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని హామీ ఇచ్చారు. పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు. 

ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీఆర్ఎస్‌కు అనుకూలంగా రాలేదని రేవంత్ రెడ్డి  అన్నారు. కామారెడ్డిలో ప్రజలు కేసీఆర్‌ను ఓడించబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని మెచ్చుకున్నారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక సంబంధం ఉందని, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడబోతున్నాయని అన్నారు.ప్రాణ త్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని  మరో ఎత్తుకు తీసుకెళ్లాడని, శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పిస్తున్నామని రేవంత్ అన్నారు.

Link to comment
Share on other sites

KTR: 2018లోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయి: కేటీఆర్ 

30-11-2023 Thu 18:46 | Telangana
  • తెలంగాణలో ముగిసిన పోలింగ్
  • ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను ఉదహరించిన కేటీఆర్
  • అప్పుడు తామే గెలిచామని వెల్లడి
  • ఇప్పుడు కూడా విజయం తమదేనని ధీమా... 70కి పైగా స్థానాలు వస్తాయని వివరణ
 
KTR condemns exit polls
Listen to the audio version of this article

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకే ఓటర్ల ఆదరణ లభించిందని ఆయా సర్వేలు వెల్లడించాయి. కాగా, పోలింగ్ సరళిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. 

2018లోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయని, కానీ గెలిచింది తామేనని వెల్లడించారు. ఆ సమయంలో ఒక్క సంస్థ మాత్రమే సరైన ఫలితాన్ని అంచనా వేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆనాటి ఎగ్జిట్ పోల్స్ వివరాలను మీడియాకు ప్రదర్శించారు. 

ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ప్రజలనే నమ్ముతామని కేటీఆర్ అన్నారు. తన అంచనా ప్రకారం బీఆర్ఎస్ కు 88 సీట్లు వస్తాయని భావించానని, కానీ కొన్ని ఆటంకాలు రావడంతో 70 ప్లస్ స్థానాలు పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. 70 సీట్లు మాత్రం ఖాయమని, ఆపైన ఎన్ని వస్తాయో చెప్పలేనని అన్నారు. ఈ విషయం డిసెంబరు 3 నాడు అందరూ చూస్తారని తెలిపారు. 

"మా నాయకులకు, మా కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే... ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూసి కంగారు పడవద్దు. గత ఎన్నికల సమయంలోనూ కొన్ని సంస్థలు ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను వెల్లడించాయి. కానీ ఇవాళ ఆ సంస్థల పేర్లు చెబితే మీడియా సమావేశంలో ఉన్న కొందరు రిపోర్టర్లు బాధపడతారు. మరి, డిసెంబరు 3న ఫలితాలు వచ్చాక, తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినందుకు క్షమాపణలు చెబుతారా?

అయినా, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాకు వ్యతిరేకంగా ఉండడం ఇదేమీ కొత్త కాదు. కొన్ని జాతీయ సంస్థలు, మరికొన్ని సంస్థలు సర్వే నామమాత్రంగా చేస్తాయంతే. ఓ రెండొందల మందిని అడిగి అదే ప్రజాభిప్రాయం అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయి. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ ఉండదు. మాకొచ్చిన సమాచారం ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ రూపొందించామంటారు... తర్వాత వాళ్లే తెలుసుకుంటారు. కానీ, ఆయా సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుందన్న విషయం గమనించాలి. 

ఓవైపు ఓటర్లు ఇంకా క్యూలైన్లలో ఉన్నారు... ఎగ్జిట్ పోల్స్ వదిలారంటే ఏమనాలి? ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ 5.30 గంటల తర్వాతే విడుదల చేయాలని చెప్పింది... అప్పటికి ఇంకా ఓటర్లు క్యూలైన్లలోనే ఉన్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? ఏదేమైనా ఎన్నికల సంఘం దీనిపై పరిశీలన చేపట్టాలి" అని వ్యాఖ్యానించారు. 

 

Link to comment
Share on other sites

AARAA Survey: హరీశ్ రావుకు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్న ఆరా సంస్థ 

30-11-2023 Thu 19:04 | Telangana
  • తెలంగాణలో ముగిసిన ఎన్నికల పోలింగ్
  • ఇక అందరి దృష్టి ఈ నెల 3న వచ్చే ఫలితాలపైనే!
  • ఆసక్తికర అంచనాలు వెలువరించిన 'ఆరా' సర్వే సంస్థ
 
AARAA Survey says Harish Rao will get highest majority in Telangana

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, 'ఆరా' సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ వివరాలు పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంచనాలు వెలువరించింది. మంత్రి హరీశ్ రావుకు తెలంగాణలో అందరికంటే అత్యధిక మెజారిటీ లభించే అవకాశం ఉందని ఆరా సంస్థ వెల్లడించింది. 

అదే సమయంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ లో తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డిలో కేసీఆర్ కు రెండో స్థానం తప్పదని అంచనా వేసింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి గెలుపు చాన్సులు కనిపిస్తున్నాయని వెల్లడించింది. 

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక రథసారథి కేటీఆర్ కు సిరిసిల్లలో మంచి మెజారిటీ వస్తుందని 'ఆరా' తెలిపింది. 

ఇక, మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉందని వివరించింది. కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మోస్తరు మెజారిటీతో గెలిచే సూచనలు ఉన్నాయని 'ఆరా' సంస్థ వెల్లడించింది. 

అటు, కరీంనగర్ లో ఆసక్తికర ఫలితం వస్తుందని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కంటే మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేసింది. హుజూరాబాద్ లో ఈటల, కౌశిక్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే విధంగా ఉంటుందని వివరించింది.

Link to comment
Share on other sites

G. Kishan Reddy: ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి 

30-11-2023 Thu 19:03 | Telangana
  • బీఆర్ఎస్ అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శలు
  • ఒత్తిడిలోనూ పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారన్న కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు
  • నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు డ్రామాలు ఆడాయని ఆగ్రహం
 
Union Minister Kishan Reddy Press Meet

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా పని చేసిందని, శక్తిమేరకు పని చేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పార్టీ కోసం మొక్కవోని ధైర్యంతో పని చేసిన కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఆగడాలను బీజేపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. బీఆర్ఎస్ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందన్నారు. ఎప్పుడు లేని విధంగా దీక్షా దివస్ అంటూ డ్రామాలు ఆడారన్నారు. దీక్షా దివస్ పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ శ్రేణులపై దాడి చేశాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా, మాకున్న శక్తిమేరకు పని చేశామని, మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నామన్నారు. పోలింగ్ ఇంకా జరుగుతోందని, కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. యువత పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా నిలిచిందన్నారు. నిన్న నాగార్జున సాగర్ వద్ద జరిగిన ఘటన సరికాదన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డ్రామాలు ఆడినట్లుగా కనిపిస్తోందన్నారు. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...