Jump to content

Em chillar veshalu ra jagga elections time lo … chetta yedava


psycopk

Recommended Posts

Nagarjuna Sagar: అర్ధరాత్రి నాగార్జున సాగర్‌ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఇరువైపుల పోలీసుల మోహరింపు! 

30-11-2023 Thu 09:42 | Both States
  • నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన
  • అర్ధరాత్రి డ్యామ్‌‌పైకి వందలాదిమంది ఏపీ పోలీసులు
  • అడ్డుకున్న సిబ్బందిపై దాడిచేసి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాల ధ్వంసం
  • ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
  • నీటి విడుదలను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
  • కుట్రలో భాగమేనన్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
 
Tensions Prevailed At Nagarjuna Sagar Dam As AP Police Ocupaid
Listen to the audio version of this article

గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్‌కు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. 

 

Link to comment
Share on other sites

  • psycopk changed the title to Em chillar veshalu ra jagga elections time lo … chetta yedava

Nagarjuna Sagar: సాగర్ నుంచి బలవంతంగా ఏపీ ప్రభుత్వం నీటి విడుదల.. షాకిచ్చిన తెలంగాణ అధికారులు 

30-11-2023 Thu 14:07 | Both States
  • సాగర్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ
  • మోటార్లకు విద్యుత్ ను ఆపేసిన తెలంగాణ అధికారులు
  • కరెంట్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఏపీ అధికారులు
 
Nagarjuna Sagar water dispute between AP and Telangana
Listen to the audio version of this article

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు సాగర్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ సమక్షంలో నీటిని విడుదల చేశారు. అయితే ఇది జరిగిన కాసేపటికి నీటి విడుదల కు బ్రేక్ పడింది. ఏపీ మోటార్లకు తెలంగాణ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో, నీటి విడుదల ఆగిపోయింది. దీంతో, కరెంట్ సరఫరాకు ఏపీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరోవైపు దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కి నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇంకోవైపు, దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ ను రగిల్చేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ వివాదాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఈ వివాదాన్ని సృష్టించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Link to comment
Share on other sites

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు.. ఉద్రిక్తత 

30-11-2023 Thu 13:03 | Both States
  • తెలంగాణ ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు
  • ఆధార్ లో ఏపీ అడ్రస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తున్న పోలీసులు
  • బోర్డర్ లో భారీగా మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు
 
AP released water of Nagarjuna Sagar from right canal
Listen to the audio version of this article

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాగర్ డ్యామ్ పై 13వ గేట్ వరకు ఏపీ పోలీసులు ముళ్ల కంచెలు వేసిన సంగతి తెలిసిందే. డ్యామ్ పై సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు కిందకు నీటిని విడుదల చేశారు. దాదాపు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

Link to comment
Share on other sites

Daggubati Purandeswari: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతపై పురందేశ్వరి ఫైర్.. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకేనని వ్యాఖ్య 

30-11-2023 Thu 12:36 | Both States
  • ఎన్నికల వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపణ
  • ఇది ఘోరాతి ఘోరమని మండిపాటు
  • 400 మండలాల కరవును 100 మండలాలకే పరిమితం చేశారని ఆగ్రహం
 
AP BJP Chief Purandeswari Fires On Naragarjuna Sagar Issue
Listen to the audio version of this article

నాగార్జున సాగర్ డ్యామ్‌ను గత అర్ధరాత్రి ఏపీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం, తదనంతర పరిణామాలతో ఉద్రిక్తత నెలకొనడంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపించారు. ఇది ఘోరాతి ఘోరమని మండిపడ్డారు. 

ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ఘటన తప్ప మరోటి కాదన్నారు. నాలుగు వందల మండలాల్లో కరవు ఉంటే వంద మండలాలకే దానిని పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు గురించి అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి ఎవరో తెలియక ప్రజలు ఆయన కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరోటి కాదని ఆరోపించారు.

Link to comment
Share on other sites

EC: నాగార్జున సాగర్ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్ రాజ్ 

30-11-2023 Thu 10:45 | Telangana
  • రాజకీయ నేతలను హెచ్చరించిన ఎన్నికల కమిషనర్
  • ఆ విషయం పోలీసులు చూసుకుంటారని వెల్లడి
  • భార్యతో కలిసి ఎస్ ఆర్ నగర్ లో ఓటేసిన వికాస్ రాజ్
  • నాగార్జున సాగర్ డ్యామ్ 13వ గేట్ పై ముళ్లకంచె వేసిన ఏపీ పోలీసులు
 
State Election Commissioner Vikas Raj Speech
Listen to the audio version of this article

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు.

నాగార్జున సాగర్ గొడవపై రాజకీయ నేతలకు కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలివేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాగా, నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి టెన్షన్ నెలకొంది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చేరుకుని 13వ నెంబర్ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.

అక్కడి వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ డ్యామ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలతో పాటు డ్యామ్ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. విషయం తెలిసి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడారు. ముళ్ల కంచెను తీసేయాలని చెప్పినా ఏపీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. 

 

Link to comment
Share on other sites

CPI Ramakrishna: తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసం.. కేసీఆర్, జగన్ కొత్త కుట్రకు తెరలేపారు: సీపీఐ రామకృష్ణ 

30-11-2023 Thu 12:36 | Andhra
  • పోలింగ్ నాడు కలకలం రేపుతున్న నాగార్జునసాగర్ ఘర్షణ
  • కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారన్న రామకృష్ణ
  • ఈ ఘర్షణ కేసీఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే అని వ్యాఖ్య
 
Nagarjuna Sagar incident is a match fixing between KCR and Jagan says CPI Ramakrishna
Listen to the audio version of this article

నాగార్జునసాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసులు ముళ్లకంచెలు వేసిన ఘటన తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై మండిపడ్డారు. సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడం వెనుక ఎన్నికల లబ్ధి ఉందని ఆయన ఆరోపించారు. పట్టిసీమలో నీళ్లు ఉన్నప్పటికీ ఇవ్వడానికి జగన్ కు మనస్కరించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని కేసీఆర్ భావిస్తున్నారని... ఇందులో భాగంగానే సాగర్ వద్ద హైడ్రామాను సృష్టించారని విమర్శించారు. ఈ ఘర్షణ కేవలం కేసీఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమేనని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు.. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్‌రెడ్డి ఫైర్ 

30-11-2023 Thu 10:06 | Telangana
  • కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్
  • నీటి సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శ
  • ఎందుకు ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్య
 
Revanth Reddy fires on KCR
Listen to the audio version of this article

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసులు చేసిన హడావుడిపై స్పందిస్తూ... ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవని... సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవని చెప్పారు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు... రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. 

 

Link to comment
Share on other sites

Utter flop aaina plan.. sudden ga apeste

oostaru two states janam ani.. edo hadividi continue chestunatu buildup

 

Nagarjuna Sagar Dam: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు భారీగా చేరుకుంటున్న తెలంగాణ పోలీసులు 

01-12-2023 Fri 09:35 | Both States
  • నిన్న ఉదయం డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • 13వ గేట్ నుంచి తమదేంటూ ముళ్లకంచె ఏర్పాటు
  • తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం
  • ఏపీది దుందుడుకు చర్యేనన్న కిషన్‌రెడ్డి
 
Tensions continuous at Nagarjuna Sagar project
Listen to the audio version of this article

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యామ్‌కు అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. డ్యామ్‌లోని 13వ గేటు నుంచి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు నిన్న వేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం  లేదు. ఈ ఉదయం కూడా ఆ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు, ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఈ ఉదయం డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు.  సాగర్ వద్ద ఉద్రిక్తతపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల సమస్య కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Aa vidam ga drama mugincharu…

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ 

01-12-2023 Fri 18:55 | Both States
  • నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఈ నెల 29 రాత్రి ఉద్రిక్తతలు
  • ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాడివేడి వాతావరణం
  • చొరవ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం
  • డ్యామ్ పై యథాతథ స్థితి ఉంటుందన్న కేంద్ర హోంశాఖ 
 
Union home ministry video conference on Nagarjuna Sagar issue

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్రం స్పందించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వర్గాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. సాగర్ డ్యామ్ వివాదంపై ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి... ఏపీ, తెలంగాణ సీఎస్ లు, డీజీపీలు... సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు  చేశారు.

సాగర్ డ్యాంపై యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొన్నారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. డ్యామ్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని భల్లా వెల్లడించారు. 

కేంద్రం ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. 

 

Link to comment
Share on other sites

GV Anjaneyulu: ఏపీలో సాగర్ కుడి, ఎడమ కాల్వలకు తేడా తెలియని మంత్రులు ఉన్నారు: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు 

01-12-2023 Fri 17:31 | Andhra
  • ఏపీ, తెలంగాణ మధ్య సాగర్ డ్యామ్ వివాదం
  • అసలు నీళ్లే లేని చోట వివాదాలా అంటూ టీడీపీ నేత జీవీ ఆగ్రహం
  • నాలుగున్నరేళ్లు ఆగి ఇప్పుడు వివాదం తీసుకువస్తున్నారని విమర్శలు
 
TDP leader GV Anjaneyulu take a jibe at YCP govt on Sagar dam issue
Listen to the audio version of this article

నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు స్పందించారు. ఏపీలో సాగర్ కుడి, ఎడమ కాల్వలకు తేడా తెలియని మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పంటలు పండించే నీళ్లతో రాజకీయ పంట పండించే అపర మేధావి జగన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అసలు నీళ్లే లేని చోట వివాదాలా? అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు ఆగి ఇప్పుడు నీటి వివాదం తీసుకువస్తున్నారని మండిపడ్డారు. డెల్టాకు నీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మౌనంగా ఉన్నారని, ఇప్పుడు పోలీసుల దండయాత్ర దేనికో జగనే చెప్పాలని జీవీ ఆంజనేయులు నిలదీశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...