Jump to content

Vasireddy amarnath on dot with election results


ANNA_PLEASE_PETTU

Recommended Posts

తెలంగాణ ఎన్నికల ఫలితాల ముందస్తు అంచనా ! 
👇👇👇👇👇👇👇👇👇👇👇👇

👉తెలగాణ కు చెందిన వివిధ వర్గాలనుంచి సేకరించిన , సమాచారం ఆధారంగా .. 

👉ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు .. 

👉నా అభిమతం కాదు .

👉మెజారిటీ ప్రజల ఆలోచన తీరును  మదింపు చేసే ప్రయత్నం మాత్రమే !  

👉నా అంచనా తప్పుకావొచ్చు .
 ఢంకా   బజాయించి ఇదే జరుగుతుంది అని నేను చెప్పడం లేదు . 

👉నా అంచనా తో మీరు ఏకీభవించక పొతే ఇక్కడ కామెంట్స్ కాలమ్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చెయ్యొచ్చు .
 ఆరోగ్య కరమయిన చర్చ ప్రజ్వమ్యానికి ఎంతైనా అవసరం ..
👇👇👇👇👇👇👇👇

తెలంగాణ లో ఓటింగ్ ముగిసింది .

👉రాష్ట్రమంతా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.

👉ప్రభుత్వ వ్యతిరేకత కు ముఖ్య  కారణాలు .

1. తెలంగాణ ప్రజల ఆత్మ  గౌరవ భావన .

2. నియామకాలు .

3. పదేళ్ల తరువాత ప్రజలు  మార్పు కోరుకోవడం .

 4. "తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలి"  అని అనుకోవడం . 

ఇంకో సారి చెబుతున్నా.. ఇవి నా ఆలోచనలు కావు  .. నా మాటలు కావు . మెజారిటీ తెలంగాణ ప్రజల  ఆలోచన .{ వారి ఆలోచన ను అంచనా వేసే ప్రయత్నమే ఇది . భిన్నాభిప్రాయాలు సహజం } 

👉నిరుద్యోగులు , ప్రభుత్వోద్యోగులు,   ముస్లిం లు { ఓల్డ్ సిటీ మినహాయించి } క్రైస్తవులు { వీరిలో ఎక్కువ భాగం } BRS ను వ్యతిరేకించి కాంగ్రస్ పక్షాన నిలిచారు .  

👉ఉమ్మడి రాష్టం లో  అగ్ర కులాలుగా పేర్కొన తగ్గ రెండు అగ్ర కులాలు తమ వ్యతిరేకతను మరచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలవడం ఒక పరిణామం ! 

 👉పాత జిల్లాల పరంగా తీసుకొంటే నల్గొండ , ఖమ్మం , మహబూబ్ నగర్  .. ఈ మూడు జిలాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది .

👉మహిళలు,  వృద్ధులు,  నగర వాసులు.. స్థూలంగా  బిర్ఎస్ వైపు నిలిచారు . 

👉బహుశా ఒక సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగివుంటే బీజేపీ గెలిచివుండేది . తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేసివుండేది .

  👉కానీ అటుపై రాజకీయ వైచిత్రి వేగంగా మారింది . బీజేపీ - BRS ఒకటే అని ప్రచారం జరిగింది . ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టలేక పోయింది . దీనితో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును బంగారు పళ్ళెరం లో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించినట్టయ్యింది .  

👉వారం పది రోజుల క్రితం అయితే ... బీజేపీ కి మూడు సీట్స్ మాత్రమే వస్తాయి అనే  పరిస్థితి . గత వారం రోజుల్లో బీజేపీ బాగా పుంజుకొంది .  
👉ఉత్తర తెలంగాణ లో త్రిముఖ పోటీ నెలకొని వుంది . బీజేపీ 8  సీట్స్ గెలుస్తుంది అంటున్నారు . అన్నీ కలిసొస్తే బీజేపీ కి 18  దాకా రావొచ్చు అంటున్నారు .  
ఒక పరిశీలకుడు "బీజేపీ ఆరునెలల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది . దీనికి సంభందించి గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది" అన్నారు .

👉👉👉👉👉👉కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది .  
65  సీట్ లకు తగ్గకపోవచ్చు . 
బూత్ స్థాయి పోల్ మేనేజిమెంట్ లో కాంగ్రెస్ కాస్త వెనుక పడింది . ఇది గ్రామాల్లో అయితే పెద్దగా ప్రభావం చూపలేదు . డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకొని అత్యధిక  శాతం గ్రామీణ వాసులు కాంగ్రెస్ వైపు నిలిచారు . 
అదే నగరాల్లో బూత్ మేనేజిమెంట్ BRS  కు అనుకూలం . ఉత్తర తెలగాణ లో బీజేపీ చీల్చేది ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక వోట్ అయితే కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీ సాధిస్తుంది . 
బీజేపీ అక్కడ  BRS  ఓట్ ను కూడా చీలిస్తే కాంగ్రెస్ 80  సీట్స్ దాక గెలుచుకొని రాజకీయ సునామి సృష్టిస్తుంది .

👉హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో మజ్లీస్ . 
 మిగతా సిటీ లో కాంగ్రెస్ బీజేపీ BRS ఈ ..   మూడు  సీట్స్ ను పంచుకొంటాయి .  

👉రంగారెడ్డి కాంగ్రెస్ వైపే . 
మెదక్ కూడా . 

👉భారత రాష్ట్ర సమితి కి ఈ ఎన్నికల్లో ఏదీ కలిసిరాలేదు అని చెప్పవచ్చు . వారి ఎత్తుగడల అనేకం బెడిసి కొట్టాయి .  
అరవై డెబ్భై సీట్స్ లో నువ్వా-  నేనా అని ఈ పార్టీ నిలిచినా చివరకు 25  సీట్స్ తో అవమానకర పరాజయం తప్పదేమో అనే పరిస్థితి నెలకొంది .  
గ్రూప్స్ పరీక్షలు , ధరణి లాంటి విషయాల్లో ముందస్తు చర్యలు చేపట్టివుంటే బహుశా మూడో  సారి  అధికారంలోకి వచ్చేదే . కానీ అతివిశ్వాసం దెబ్బతీసినట్టుంది . 
అలాగే వాచాలత్వం కూడా ! 

👉👉తెలగాణ రాష్ట్రం కోసం పోరాడింది సకల జనులు .  
… వారి నాయకుడు కెసిఆర్ . 
పదేళ్లకు పైగా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడిని తెలగాణ ప్రజలు పదేళ్ల పాటు చీఫ్ మినిస్టర్ చేసారు . 
 👉తెలంగాణ  ఇచ్చింది కాంగ్రెస్ . కాకపోతే దానికోసం పదేళ్లు తెలంగాణ ప్రజలు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది . బహుశా అందుకేనేమో .. ప్రజలు కాంగ్రెస్ ను అధికారం కోసం పదేళ్లు వెయిట్ చేసేలా చేసారు .  
తెలంగాణ  ఇవ్వడం లో సహకరించింది బీజేపీ . 
మరి బీజేపీ ను వచ్చే ఎన్నికల్లో ఎలా ఆదరిస్తారో చూడాలి . 

👉కేంద్రీకృత పాలన భారత రాష్ట్ర సమితి బలం .. బలహీనత .

👉కాంగ్రెస్ లో వికేంద్రీకృత పాలన ఉంటుంది . అది వారి బలం .. బలహీనత .

👉ప్రజాస్వామ్యం లో ప్రజలు ఎన్నుకొన్న వారే నాయకులు. ప్రజా తీర్పును గౌరవించాలి .  

👉👉👉కాంగ్రెస్,  ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ పార్టీ కి .. నాయకులకు శుభాకాంక్షలు .

👉👉👉ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పక్షాలు   అలవి కాని హామీలు ఇచ్చాయి .
 ఏ పార్టీ గెలిచినా ఆర్థిక సంకటం తప్పదు .
 ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అగమ్య గోచరం . ఇంకా ఉచితాలు .

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పదవి  ముళ్ల  కిరీటం .
దాన్ని ధరించడం  ఇప్పుడెవ   రే "వంతు"  ?

( నా అంచనా ఆధారంగా ఎవరూ బెట్టింగ్ కాయొద్దు. బెట్టింగ్ వ్యసనం మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ). 

సర్వేజనా సుఖినోభవంతు !🙏🙏

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...